ఘనంగా రాములవారి కళ్యాణం పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు...
చిన్న శంకరంపేట ,మార్చి 27 ( ప్రజాస్వరం ):
చిన్న శంకరంపేట మండలం లోని సూరారం, చందంపేట, ఎస్ కొండాపూర్, మడూర్, శాలిపేట, వెంకట్రావుపల్లి, గ్రామాలలో సీతారాముల కల్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మిర్జాపల్లి గ్రామంలో ఆలయ ధర్మకర్త పోతరాజు రమణ ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ నాలుగవ వార్షికోత్సవాలలో భాగంగా దేవాలయంలో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు, అనంతరం శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారాముల కళ్యాణం ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు, శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారామచంద్రుల విగ్రహాలను గ్రామంలోని పురవీధుల గుండా ఊరేగింపుగా నిర్వహిస్తూ ఎదుర్కోవడం జరిగింది, ఊరేగింపులో గ్రామస్తులు ట్రాక్టర్ పై నీళ్లు పోస్తూ స్వామి వారి విగ్రహాలకు హారతులు ఇస్తూ స్వాగతం పలికారు, కళ్యాణం అనంతరం మహిళల పెద్ద ఎత్తున తరలివచ్చి ఒడిబియ్యం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు, దేవాలయం వద్ద గ్రామానికి చెందిన వెంకటేష్ ఆర్థిక సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు, అదేవిధంగా దేవాలయానికి గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ 50 కుర్చీల తో పాటు పందిరి ఏర్పాటుకు 15 వేల రూపాయల నగదును అందజేశారు, ఈ సందర్భంగా ఆలయ పూజారి తో పాటు మాజీ జెడ్పిటిసి ఆలయ ధర్మకర్త పోతరాజు రమణ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా దేవాలయ వద్ద వార్షికోత్సవ వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుందని శ్రీరామ నవమి రోజే కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆలయ వార్షికోత్సవంతో పాటు సీతారాముల కళ్యాణాన్ని ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుందని స్వామివారి కృప కటాక్షాలు ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు అందరిపై ఉండాలని స్వామి మొక్కుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పోతరాజు రమణ, తోపాటు మాజీ సర్పంచ్ జనార్ధన్, రాజు రెడ్డి, సాన సత్యనారాయణ, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, కృష్ణగౌడ్, శ్రీనివాస్ గౌడ్, ప్రభాకర్, గంగాధర్ గౌడ్, మహేష్, ప్రవీణ్ కుమార్, ఉదయ్, రాజ్ కుమార్ గౌడ్, స్వామి, తదితరులు పాల్గొన్నారు.


