చిన్న శంకరంపేట మండలంలో పర్యటించిన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనoపల్లి రోహిత్...

చిన్న శంకరంపేట మండలంలో పర్యటించిన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనoపల్లి రోహిత్...

చిన్న శంకరంపేట,   మార్చి 27 ( ప్రజాస్వరం ):

 

చిన్న శంకరంపేట మండలంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ పర్యటించారు మిర్జాపల్లి చిన్న శంకరంపేట ఎస్ కొండాపూర్ గ్రామాలలో పర్యటించారు, మిర్జాపల్లి గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న సీతారాముల కళ్యాణం లో పాల్గొని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మండల కేంద్రంలోని అనంత పద్మనాభస్వామి దేవాలయంలో కళ్యాణోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు, ఈ సందర్భంగా మిర్జాపల్లిలో దేవాలయ ధర్మకర్త రమణతోపాటు గ్రామస్తులు శాలువాలతో ఘనంగా సన్మానించారు చిన్న శంకరంపేట మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ మాజీ సర్పంచులు రామకృష్ణయ్య రాజిరెడ్డి తో పాటు పలువురు నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గ ప్రజలంతా కూడా సుఖసంతోషాలతో ఉండాలని నియోజకవర్గo మొత్తం పర్యటించడం జరిగిందని స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొనడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని ఆయన తెలిపారు, నియోజకవర్గ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారి కృపా కటాక్షాలు ఈ నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ప్రజలంతా సుభిక్షంగా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు,

Latest News

శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వైభవంగా కళ్యాణోత్సవం.... శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వైభవంగా కళ్యాణోత్సవం....
జగదేవ్ పూర్, మార్చి 27 (ప్రజాస్వరం ):జగదేవ్‌పూర్ మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జంగంరెడ్డిపల్లి గ్రామంలో వెలసిన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం...
ఘనంగా రాములవారి కళ్యాణం పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు...
మల్కాపూర్ లో వైబావ పేతంగా శ్రీ సీతారాముల కళ్యాణం  ....
అంగరంగ వైభవంగా రాముడి కళ్యాణ మహోత్సవం....
చిన్న శంకరంపేట మండలంలో పర్యటించిన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనoపల్లి రోహిత్...
తూప్రాన్ లో అంగరంగ వైభవంగా సీతారాములు కల్యాణం... 
కేంద్ర ప్రభుత్వ నిధులతో సిసి రోడ్డు శంకుస్థాపన....