భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ప్రతిష్ట ఉత్సవాలలో పాల్గొన్న మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి...

భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ప్రతిష్ట ఉత్సవాలలో పాల్గొన్న మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి...

చిన్న శంకరంపేట, మార్చి 16 ( ప్రజాస్వరం):

 

చిన్నశంకరంపేట మండలం బాగీర్తి పల్లి గ్రామంలో మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రతిష్ట, కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు, మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, నియోజకవర్గం ఇంచార్జి కంఠారెడ్డి తిరుపతి రెడ్డి, మాజీ జెడ్పిటిసి మాధవి రాజు లు హాజరయ్యారు గ్రామంలోని యాదవ సంఘం ఆధ్వర్యంలో వచ్చిన అతిథులను భాజా భజంత్రీలతో ఘన స్వాగతం పలికారు, శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం రేణుక మాత దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం వచ్చిన అతిథులను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాలయాల నిర్మాణాలు చేపట్టి ప్రతిష్టత చేపట్టి ఈ ఉత్సవాలు నిర్వహించడం, మల్లికార్జున స్వామి కృపతో గ్రామంలోని ప్రజలు పాడిపంటలతో సుఖసంతోషాలతో ఉండాలని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వారు తెలిపారు, స్వామివారి కృప కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతోపాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలని గ్రామాలలో దేవాలయాలు నిర్మాణాలు చేపట్టి ఆధ్యాత్మికత నెలకొల్పడం జరుగుతుందని, దేవాలయాల నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్ సావిత్రి పోచయ్య యాదవ్, మాజీ సర్పంచ్ సూల్ల దయానంద్ యాదవ్, యాదవ సంఘం గ్రామ అధ్యక్షుడు అయితర బోయిన మహేష్, ఉపాధ్యక్షుడు సంజీవ్ యాదవ్, సూరారం సర్పంచ్ నాగరాజు, మాజీ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు యాదగిరి యాదవ్, వివిధ గ్రామాల సర్పంచులు ఉపసర్పంచ్లు కార్యకర్తలతో పాటు, నాయకులు లక్ష్మారెడ్డి, ప్రభాకర్, రాజు, మహిపాల్ రెడ్డి, పాండు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Latest News

తూప్రాన్ లో ఉగాది రోజు ఐలాండ్ పునః ప్రారంభం.... తూప్రాన్ లో ఉగాది రోజు ఐలాండ్ పునః ప్రారంభం....
తూప్రాన్, మార్చి 19 (ప్రజాస్వరం ) :   పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మున్సిపల్ నర్సాపూర్ చౌరస్తా వద్ద ఎంతో ప్రతిష్టత్మాకంగా ఏర్పాటు చేసిన ఐలాండ్ గత...
వర్షాలు సమృద్ధి గా కురిసి పంటలు పండుతాయి. ....
కామారంలో ప్రారంభమైన క్రికెట్ లీగ్ పోటీలు....
6 వ వార్డులో పంచాంగ శ్రావణం పాల్గొన్న కౌన్సిలర్ గుమ్మడిదల మహేశ్వరి రాజేష్....
తూప్రాన్ మున్సిపాలిటీలో 10 వార్డులో వాటర్ ప్లాంట్ ప్రారంభం..... 
తూప్రాన్ లో చలివేంద్రం ప్రారంభించిన డీసీఎం ఓనర్స్....
హాస్టల్ విద్యార్థినులపై అసభ్య ప్రవర్తన, నిందితులకు 3 ఏళ్ల జైలు శిక్ష: