ఘనంగా శివపార్వతుల కళ్యాణం...
చిన్న శంకరంపేట, మార్చి 28 (ప్రజాస్వరం ):
చిన్న శంకరంపేట మండలం గవలపల్లి గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద శివపార్వతుల కళ్యాణోత్సవం ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు, ప్రతి సంవత్సరం శ్రీరామనవమి మరుసటి రోజు శివపార్వతుల కళ్యాణమని నిర్వహిస్తుంటారు గవలపల్లిలో ఈ దేవాలయం కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మాణం చేసిన దేవాలయం కాగా కొద్ది రోజుల క్రితం దేవాలయ పున:ప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టి నాటి నుండి ఆనవాయితీగా వస్తున్న శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారు, ప్రతి సంవత్సరం ఐదు రోజులపాటు ఈ దేవాలయం వద్ద ఉత్సవాలు నిర్వహిస్తుంటారు నేడు శివపార్వతుల కళ్యాణం పురస్కరించుకొని ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనము, హోమం, శివపార్వతుల కళ్యాణం, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు, అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు, ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరేందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, మాట్లాడుతూ భక్తుల కొంగు బంగారం గా పిలుస్తున్న రామలింగేశ్వర స్వామి దేవాలయం అతి ప్రాచీన దేవాలయం అని కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయం శిథిలం కావడంతో దేవాలయాన్ని పున:ప్రతిష్ట చేసుకోవడం జరిగిందని నాటినుండి నేటి వరకు ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి మరిసటి రోజు ఉత్సవాలు ప్రారంభించడం జరుగుతుందని ఐదు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తామని దాతల సహకారంతో కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దేవాలయం వద్ద ఐదు రోజులపాటు ఉత్సవ కార్యక్రమాలు కొనసాగుతాయని వారన్నారు స్వామివారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


