48 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు....
వృద్ధ దంపతుల పై దాడి, దోపిడి దొంగ అరెస్ట్....
4.5 తులాల బంగారు ఆభరణాల స్వాధీనం....
మెదక్ ,మార్చి 28 (ప్రజాస్వరం):
పట్టపగలు, వృద్ధ దంపతుల పై దాడి చేసి దోపిడీకి పాల్పడిన కేసును 48 గంటల్లో చేయించినట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25 న చిన్న శంకరం పేట మండలం జంగారాయి కి చెందిన తుమ్మల అంజయ్య (85), సావిత్రమ్మ (80) దంపతుల ఇంట్లో మధ్యాహ్నం సమయంలో ముసుగు వేసుకుని వాటిలో బైక్ బంపర్ రాడ్ తో దాడి చేసి 4.5 తులాల బంగారు ఆభరణాలను దోచుకుని వెళ్ళడం జరిగిందని అన్నారు. ఈ కేసులో అదనపు ఎస్పీ మహేందర్ సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా ఈ నెల 28 న ఉదయం తూప్రాన్ బస్ స్టాప్ లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి పట్టుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకొని అతని వద్ద చోరీ చేసిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు. నిందితుడు విరిగే వెంకట నారాయణ వృద్ధ దంపతుల మనవరాలి భర్త కావడంతో అతనికి వీరు ఒంటరి గా ఉంటారనే విషయం తెలుసుకుని చేసిన అప్పులను తీర్చేందుకు ఈ దోపిడి చేయడం జరిగిందని అన్నారు. ఈ కేసు చేదన వేగంగా చేసిన తూప్రాన్ డీఎస్పీ, రామాయంపేట సీఐ, ఎస్ఐ, సీసీ ఎస్ కానిస్టేబుల్స్ లను ఆయన అభినందించారు.


