బార్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్ సాగర్ కు సన్మానం ....

సన్మానం చేసిన కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్ 

బార్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్ సాగర్ కు సన్మానం ....

గజ్వేల్ , మార్చి  30 (ప్రజాస్వరం):

 

గజ్వేల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఇటీవల ఎన్నికైన కిరణ్ సాగర్ ను సోమవారం 20వ వార్డులో వార్డ్ కౌన్సిలర్ అత్తిలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ గజ్వేల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఘన విజయం సాధించిన కిరణ్ సాగర్ సార్ కు అభినందనలు శుభాకాంక్షలు, న్యాయ వ్యవస్థలో క్రియాశీల పాత్ర పోషిస్తూ సామాన్యులకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తూ అందరి అభిమానం పొందిన కిరణ్ సాగర్ గారు, గజ్వేల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికవ్వడం సంతోషంగా ఉంది, తన పదవీకాలంలో న్యాయమూర్తుల సమస్యల పరిష్కారానికి, బార్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తారని, ఆశిస్తూ, రాబోయే కాలంలో మరిన్ని ఉన్నత పదవులు స్వీకరించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం, లాయర్ గా విధులు నిర్వహిస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందు వరుసలో ఉంటూ, పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న కిరణ్ సాగర్ సార్ కు మరొక్కసారి అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో 20 వ వార్డ్ పెద్దలు,యువకులు,వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు