బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా వర్గంటి రామ్మోహన్ గౌడ్.. 

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా వర్గంటి రామ్మోహన్ గౌడ్.. 

రాష్ట్ర కమిటీలో జిల్లా లో ఒక్కరికే అవకాశం 

 

తూప్రాన్ , మార్చి  31 (ప్రజాస్వరం) :

పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి 

 

తెలంగాణ రాష్ట్ర బీజేపీ  కార్యవర్గంలో మెదక్ జిల్లా నుండి ఏకైక నాయకుడైన వర్గంటి రామ్మోహన్ గౌడ్ కు అవకాశం ఇవ్వడం పట్ల రాష్ట్ర బీజేపీ అధ్యక్షులకు రామచంద్ర రావు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలో క్రమశిక్షణ గల నాయకుడి గా పని చేయడంతో గుర్తించి నాకు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా జిల్లా నుండి నాకు అవకాశం ఇవ్వడం నా పై మరింత బాధ్యత పెంచిందని పార్టీ బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని వర్గంటి రామ్మోహన్ గౌడ్ తెలిపారు .

తెలంగాణ రాష్ట్ర బిజెపి పార్టీలో కీలక నియామకం చోటుచేసుకుంది. సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకంతో జిల్లాలో బీజేపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వర్గాంటి రాంమోహన్ గౌడ్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు , జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లేష్ గౌడ్ , సీనియర్ నాయకులు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. “మీ ప్రేమే నా బలం – మీతో ఈ బంధమే నా ఊపిరి. మీ అందరి ఆశీస్సులతో మరింత బాధ్యతగా, శక్తివంతంగా పనిచేస్తాను. జిల్లాలో బిజెపి పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను” అని ఆయన స్పష్టం చేశారు.

 ఈ నియామకం ద్వారా మెదక్ జిల్లాలో బిజెపి పార్టీకి కొత్త ఊపు లభిస్తుందని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.