తూప్రాన్ లో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు ....
తూప్రాన్ చెరువుకట్ట వీరాంజనేయ స్వామి జయంతి ఆలయం లో పూజా
తరలివస్తున్న వేలాది భక్తులు
జైశ్రీరామ్ జై హనుమాన్ అంటూ భక్తుల నినాదాలు
తూప్రాన్, మార్చి 31 (ప్రజాస్వరం ) :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని చెరువుకట్టపై ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా భక్తి వాతావరణంతో కళకళలాడుతోంది. స్వయం భువుగా వెలసిన ఈ పవిత్ర క్షేత్రం, ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా వైభవంగా ఉత్సవాలను మంగళవారం రోజున పరభావనమ సంవత్సరం చైత్ర శుద్ధ చతుర్దశి రోజున గణపతి పూజ, పుణ్యాహవాచనము, అఖండ దీపారాధన , అంకురార్పణం, గురు చరిత్ర పారాయణము , సుందరకాండ , మన్యు పాశుపదం, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలతో మూడు రోజుల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
ఆలయ పురోహితులు శ్రీ శలాక ఆత్రేయ శర్మ ఆధ్వర్యంలో ఆలయాన్ని పూలతో, విద్యుత్ దీపాలతో అలంకరించి ఆధ్యాత్మిక కాంతిని విరజిమ్మేలా తీర్చిదిద్దుతున్నారు. భక్తులు దర్శనార్థం పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో ఆలయం పరిసరాలు ఆధ్యాత్మిక చైతన్యంతో నిండిపోయాయి.భక్తిశ్రద్ధలతో ప్రారంభమైన కార్యక్రమాలు
హనుమాన్ జయంతి ఉత్సవాలకు
ఆలయ పురోహితులు హనుమాన్ మలదరణ గురుస్వామి సలాక ఆత్రేయ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. మాలధారణ స్వాములు కలిసి
హనుమాన్ చాలీసా పారాయణం
దండక పఠనం
నిరంతర నామస్మరణ
రామకోటి కార్యక్రమాలు
శ్రీ సీతారాముల, హనుమాన్ భజనలు
భక్తి పరవశంతో నిర్వహించారు. ఆలయ ప్రాంగణం అంతా “జై శ్రీరామ్”, “జై హనుమాన్” నినాదాలతో మార్మోగింది.
ఈ ఉత్సవాల్లో భాగంగా తూప్రాన్ వాస్తవ్యులు ఆలయ పురోహితులు గురు స్వామి ఆత్రేయ శర్మ సమక్షంలో హనుమాన్ మాలధారణ స్వాములకు మరియు భక్తులకు మహా అన్నదాన ప్రసాదం ఏర్పాటు చేశారు. వేలాదిమంది భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఈ సందర్భంగా గురుస్వాములు సలాక ఆత్రేయ శర్మ మాట్లాడుతూ తూప్రాన్ చెరువు కట్ట హనుమాన్ పిలుస్తే పలికే కొంగు బంగారం అని పూజారి అన్నారు
హనుమాన్ మాలధారణ స్వాములకు ఆ భగవంతుడు కష్టాల నుండి కాపాడి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ ఆలయంలో మూడు రోజుల ఉత్సవాలు ఘనంగా పూజలు గణపతి పూజ, పుణ్యాహవాచనం, అఖండ దీపారాధన, అంకురార్పణం , సుందరకాండ, గురు చరిత్ర పారాయణం, మన్యు పాశుపదం, తీర్థ ప్రసాద వితరణ, గణపతి, నవగ్రహ, రుద్ర , పంచసూక్త, మన్యుసూక్త, లక్ష్మీ హోమములు, బిక్ష ఇరుముడి, మంగళహారతులు, మంత్రపుష్పము, గురువారం హనుమాన్ జయంతి రోజున హనుమతు మన్నుపాశుపదం , సింధూరం, లక్ష పత్ర పూజ, లక్ష పుష్పార్చన, గణపతి పంచాయతన దేవాలయంలో ఉన్న అమ్మవారికి ఉడిపియ్యము కుంకుమార్చన శ్రీ శ్రీ శ్రీ
యతివార మాధవ నంద సరస్వతి స్వామి వారి పాదపూజ, అనుగ్రహ భూషణ ఉదయము 9 గంటల నుండి 11 గంటల వరకు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు తీర్థ ప్రసాద వితరణ , అన్నదానం, మాల విరమణ జరుపబడునని
అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది అని అన్నారు. భగవంతుడు ఇచ్చిన వరంగా భావించి ఈ సేవను చేస్తున్నాం”
అని తెలిపారు. నీళ్ల దానం, అన్నదానం వంటి పుణ్యకార్యాలు సమాజంలో సేవా భావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఆలయ విశిష్టత
చెరువుకట్టపై వెలసిన ఈ వీరాంజనేయ స్వామి ఆలయం ఎన్నో ఏళ్లుగా భక్తులకు ఆధ్యాత్మిక నిలయంగా నిలుస్తోంది. నిత్య పూజలు, ప్రత్యేక ఉత్సవాలతో ఈ ఆలయం ప్రాంతంలో దివ్య క్షేత్రంగా పేరుగాంచింది. భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని స్థానిక ప్రముఖులు హామీ ఇచ్చారు. మార్చి 31వ తేదీ మంగళవారం నుండి ఏప్రిల్ 2వ తేదీ గురువారం వరకు హనుమాన్ జయంతి ఉత్సవాలు, గణపతి పంచాయతన, శ్రీ సత్యనారాయణ స్వామి, శ్రీ శనీశ్వర స్వాముల నవగ్రహ వార్షికోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు శ్రీ సలాక ఆత్రేయ శర్మ తెలిపారు. ఈ పుణ్య కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారి కృపకు పాత్రులవ్వాలని ఆహ్వానించారు.
పెద్ద చెరువు కట్ట హనుమాన్ గుడి – తూప్రాన్ హనుమాన్ మాలధారణ విరమణ క్షేత్రములో స్వర్గీయ శ్రీ సలాక శ్రీనివాస్ శర్మ ఆశీస్సులతో
భక్తి, సేవ, సంప్రదాయం కలిసిన ఈ దివ్యక్షేత్రం హనుమాన్ జయంతి సందర్భంగా మరింత ఆధ్యాత్మిక ప్రకాశాన్ని విరజిమ్ముతోంది. ఆలయ ధర్మకర్త శ్రీ సలాక ఆత్రేయ శర్మ ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ శృంగేరి పీఠాధేశ్వరులు జగద్గురు శంకరాచార్యులు భారతి తీర్థమహా స్వామి వారి దివ్య ఆశీస్సులతో, శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామి దివ్య ఆశీస్సులతో, శ్రీశ్రీ కృష్ణానంద సరస్వతీ స్వామి వారి కరకమలములచే ప్రతిష్టించబడిన గణపతి,పంచాయతన, సత్యనారాయణ స్వామి, శనీశ్వర స్వాముల 28వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవములు ఘనంగా నిర్వహించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 2వ తేదీ గురువారం ఉదయం హనుమత్ మన్యుపాశుపతం, సింధూరం, లక్షపత్ర పూజ, లక్ష పుష్పార్చన, గణపతి పంచాయతన దేవాలయంలో అమ్మవారికి ఒడిబియ్యం, కుంకుమార్చన, అనంతరం శ్రీశ్రీశ్రీ యతివర మాధవానంద సరస్వతి స్వామి వారి పాదపూజ, అనుగ్రహ భాషణ ప్రవచనం, మరియు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు, తీర్థప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం, మాల విరమణ జరుపబడునని ఆలయ ధర్మకర్త గురుస్వామి శ్రీ సలాక ఆత్రేయ శర్మ, తెలిపారు.


