రావల్ కోల్ గ్రామంలో ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం...
By Prajaswaram
On
మేడ్చల్, మార్చి 28 (ప్రజాస్వరం):
శ్రీ రామనవమి సందర్భంగా ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని రావల్ కోల్ గ్రామంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. ఉదయం నుండి గ్రామంలో సీతారాముల భక్తి పాటలతో మారుమోగిపోయింది. సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో విచ్చేసారు. రాముల వారి కళ్యాణం అనంతరం ఉత్సవమూర్తులకు భక్తులు ఒడిబియ్యం సమర్పించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య సీతారాముల వారి కళ్యాణం కన్నుల పండుగ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్లంపేట్ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీదేవి రమేష్ నాయక్, మేడ్చల్ మండల మాజీ వైస్ ఎంపీపీ గోపని వెంకటేష్, మామిండ్ల వెంకటేష్ లతో పాటు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Latest News
31 Mar 2026 21:06:01
తూప్రాన్, మార్చి 31 (ప్రజాస్వరం ) : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మండలం గౌడి గూడెంలో ఇటీవల ఇసుక అక్రమ రవాణా కేసులో గౌడి గూడెం...


