అలరించిన యక్షగాన రామాయణం....

అలరించిన యక్షగాన రామాయణం....

మాసాయిపేట, మార్చి 28 (ప్రజాస్వరం):

 

మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన 'యక్షగాన రామాయణం' భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. శ్రీరామనవమి పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ బాగోతాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించారు. అంతరించిపోతున్న పురాతన కళారూపానికి మళ్లీ జీవం పోసినట్లుగా ఈ ప్రదర్శన సాగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని యక్షగాన కళాకారులను అభినందించారు.