తూప్రాన్ మున్సిపల్ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఘన సత్కారం, అభినందనలు ...
బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో వర్గంటి రామ్మోహన్ గౌడ్ ఎన్నిక
ప్రత్యక స్థానం
తూప్రాన్ ,ఏప్రిల్ 1 (ప్రజాస్వరం ):
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైన వర్గంటి రామ్మోహన్ గౌడ్ ను తూప్రాన్ మున్సిపల్ శాఖ అధ్యక్షుడు భూమన్నగారి జానకిరామ్ గౌడ్ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ చందా అశోక్ మన్నే స్వామి, మున్సిపల్ జనరల్ సెక్రటరీ బసంపల్లి సంపత్ గౌడ్, యువమోర్చా మున్సిపల్ అధ్యక్షుడు వంగలి నవీన్ యాదవ్ మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జానకిరామ్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ మరియు మెదక్ ఎంపీ శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారి ఆశీస్సులతో మెదక్ జిల్లా నుండి పార్టీ కోసం నిరంతరం కష్టపడే నాయకుడిని గుర్తించి రామ్మోహన్ గౌడ్ కు ఈ పదవిని అప్పగించినట్లు ఆయన తెలిపారు. ఈ గుర్తింపునకు గానూ రాష్ట్ర పార్టీకి మరియు రఘునందన్ రావు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో వైస్ ఎంపీపీగా బాధ్యతలు నిర్వహించిన రామ్మోహన్ గౌడ్ ఇప్పుడు రాష్ట్ర కార్యవర్గంలో చోటు దక్కించుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ లో బిజెపి కార్యకర్తలు.యువత కృషితోటి మూడు సీట్లు గెలవడం జరిగింది. రాబోయే ఎంపీటీసీ, జడ్పిటిసి
మరియు అసెంబ్లీ ఎన్నికల్లో కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని, యువత అధిక సంఖ్యలో భాగస్వాములై పార్టీని విజయపథంలో నడిపించాలని ఈ సందర్భంగా జానకిరామ్ గౌడ్ పిలుపునిచ్చారు.


