అక్రమంగా మట్టి తరలింపును అడ్డుకున్న అధికారులు....

అక్రమంగా మట్టి తరలింపును అడ్డుకున్న అధికారులు....

 జేసీబీలు, ట్రాక్టర్ లను పట్టుకున్న రెవెన్యూ అధికారులు.... 

 

తూప్రాన్, ఏప్రిల్ 1 (ప్రజాస్వరం):

 పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి 

 

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం యావాపూర్ శివారులో అక్రమంగా మట్టి తరలిస్తున్నట్లు సమాచారంతో తాసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ సిబ్బందితో కలిసి మట్టి తరలిస్తున్న స్థలానికి చేరుకొ గా అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమి లో మట్టి జెసిబి లతో తవ్వకాలు చేస్తూ ట్రాక్టర్ ల ద్వారా తరలిస్తుండగా పట్టుకొని తూప్రాన్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు రెవిన్యూ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ తెలిపారు