హనుమాన్ ఇరుముడి శోభయాత్ర... 

హనుమాన్ ఇరుముడి శోభయాత్ర... 

జైశ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో మార్మోగిన శోభయాత్ర 

తెలంగాణ లో తూప్రాన్ మరో కొండా గట్టు 

 

తూప్రాన్, ఏప్రిల్ 1( ప్రజాస్వరం):

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో పెద్ద చెరువు కట్టపై వెలసిన వీరాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి పురస్కరించుకొని బుధవారం రోజు మాలాధారణ చేసిన 250 మంది హనుమాన్ స్వాములు ఇరుముడి ధరించి ఆలయ పూజారి గురుస్వామి ఆత్రేయ శర్మ ఆధ్వర్యంలో ఎర్రటి ఎండలో భారీ పాద శోభాయాత్ర నిర్వహించారు.  కగా 40 సంవత్సరాలుగా తూప్రాన్ వీరాంజనేయ స్వామి ఆలయం లో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాట్లు ఆత్రేయ శర్మ పేర్కొన్నారు. తెలంగాణ లోనే మరో కొండా గట్టు ఆంజనేయ స్వామి ఆలయం గా ప్రసిద్ధిగాంచిన ఆలయం సంతానం వివాహాలు వ్యాపార అభివృద్ధి ఉద్యోగం లాంటి కోరికలకు కొలువైన దేవుడు వీరాంజనేయుడు అని ఆయన తెలిపారు.  ఉదయము పుణ్యవచనం హోమం ఇరుముడి శోభయాత్ర రేపు గురువారం రోజు ఉదయం ఆంజనేయుస్వామి చందన అభిషేకం లక్ష ఆకుపూజ లక్ష పుష్పర్చన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు అనంతరం మహా అన్నధానం ఉంటుంది భక్తులు అధిక సంఖ్య లో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని ఆత్రేయ శర్మ కోరారు.