తూప్రాన్ మున్సిపల్ తైబజార్43 లక్షల 35 వేలకు నాగరాజు కైవసం.... 

తూప్రాన్ మున్సిపల్ తైబజార్43 లక్షల 35 వేలకు నాగరాజు కైవసం.... 

తూప్రాన్, మార్చి 18 (ప్రజాస్వరం ) :

 

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మున్సిపల్ తైబజార్ వేలం పాట 18.03.2026 బుధవారం ఉదయం 11.00 గంటలకు మున్సిపల్ కార్యాలయం యందు 2026-27 ఆర్ధిక సంవత్సరానికి గాను తై బజార్ మరియు పశువుల సంత బహిరంగ వేలం పాట కార్యక్రమాన్ని కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి నిర్వహించడం జరిగినది. ఇట్టి వేలం లో తై బజార్ వేలమునకు గాను రెండు డీడీ లు రాగా గత ఆర్దిక సంవత్సరం రూ.36,20,000/- లకు ఉన్నందున అట్టి మొత్తానికి 10% పెరుగుదల కలుపుకొని రూ. 39,82,000/- ల రూపాయలతో వేలం పాట ప్రారంభించగ ఇట్టి వేలం లో ఇద్దరు వ్యక్తులు అనగా 1. తుమ్మల గణేష్, 2. మన్మరొల్ల నాగరాజు లు పాల్గొనడం జరిగినది. ఇందులో అత్యధికంగా శ్రీ.మన్మరొల్ల నాగరాజు, తండ్రి. రత్నయ్య, నివాసం తూప్రాన్ వాసి రూ. 43,35,000/- లకు పాట పాడి వేలమును కైవసం చేసుకున్నారు. అనంతరం పశువుల సంత వేలమునకు గాను ఒక్క సభ్యుడు మాత్రమే డీడీ సమర్పించినారు కావున ఈ రోజు పశువుల సంత బహిరంగ వేలాన్ని వాయిదా వేస్తూ తిరిగి 25.03.2026 బుధవారం నాడు ఉదయం 11.00 గంటలకు నిర్వహించబడునని గౌరవ మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి ప్రకటన చేయడం జరిగినది.

Latest News