రంజాన్ ఇఫ్తార్ విందు...

రంజాన్ ఇఫ్తార్ విందు...

మాసాయిపేట, మార్చి 18 (ప్రజాస్వరం):

 

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని మాసాయిపేటలోని మసీదులో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. సర్పంచ్ కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ పసుల వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ కార్య క్రమం జరిగింది. ఈ సందర్భంగా ముస్లింలకు విందు అందజేసి, పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామంలో మతసామరస్యం, సోదరభావం వెల్లివిరియాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

Latest News