పోగొట్టుకున్న బంగారు ఆభరణాల బ్యాగ్ బాధితులకు అప్పగించిన పోలీస్ లు....
తూప్రాన్, మార్చి 27( ప్రజాస్వరం ):
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
తూప్రాన్ మండలం అల్లాపూర్ కు చెందిన నర్సింలు బైక్ పై దొంతి కూతురు పెళ్లి రోజు సందర్బంగా వెళుతున్న క్రమంలో బ్రాహ్మణ పల్లి రైల్వే గేటు స్పీడ్ బ్రేక్ వద్ద బైక్ నుండి 9 తుల్లాల బంగారు ఆభరణ ల బ్యాగ్ పడిపోయింది కొద్ది దూరం వెళ్లి చూడగా బ్యాగ్ లేకపోవడం తో శుక్రవారం ఉదయం డయల్ 100 ద్వారా సమాచారం అందగా, బ్రాహ్మణపల్లి రైల్వే గేట్ సమీపంలో ఒక వ్యక్తి తన బ్యాగ్‌ను కోల్పోయినట్లు, అందులో సుమారు 9 తులాల బంగారం ఉన్నట్లు తెలియజేశారు.
వెంటనే తూప్రాన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో, ఫిర్యాదు దారు మోటార్ సైకిల్‌పై ప్రయాణిస్తూ బ్యాగ్‌ను సైడ్ హ్యాండిల్‌కు వేలాడదీసి తీసుకెళ్తుండగా, ఆ క్రమంలో అది ప్రమాదవశాత్తు కింద పడిపోయినట్లు తెలిసింది.
పోలీసులు వెంటనే సీసీ కెమెరాలను పరిశీలించి, ప్రాంతంలో విచారణ చేపట్టారు. దాంతో ఆ బ్యాగ్ ఒక స్పీడ్ బ్రేకర్ వద్ద పడిపోయినట్లు, అక్కడి నుంచి ఒక వ్యక్తి దాన్ని తీసుకున్నట్లు గుర్తించారు.
తక్షణమే ఆ వ్యక్తిని పోలీసులు గుర్తించి అతని వద్దకు వెళ్లగా, అతను మా వద్ద ఒక బ్యాగ్ ఉన్నట్లు టి పాయింట్ యజమాని నాగరాజు కృష్ణ అనే వ్యక్తులు స్వయంగా తెలిపాడు . పరిశీలించగా, అందులో ఉన్న సుమారు 9 తులాల బంగారం (రెండు చైన్‌లు)ను స్వాధీనం చేసుకుని యజమానికి తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ అప్పగించారు.
తూప్రాన్ పోలీసులు చురుకుగా స్పందించి, సమర్థవంతంగా విచారణ జరిపి, కేవలం ఒక గంటలోనే మొత్తం ఆస్తిని రికవరీ చేశారు.
ఈ సందర్భంగా తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తూప్రాన్ సిఐ రంగా కృష్ణ ఎసై గంగారాజు ను పోలీసు సిబ్బందిని అభినందించారు.


