తూప్రాన్ గీతా స్కూల్ యాజమాన్యానికి విద్యా పురస్కారం ....
తూప్రాన్ , మార్చి 28 (ప్రజాస్వరం ) :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
విద్యా రంగంలో విశిష్ట సేవలoదిస్తున్న తూప్రాన్ గీతా స్కూల్ యాజమాన్యానికి హెచ్. ఎం. టీవీ మరియు హన్స్ ఇండియా వారి "విద్యా పురస్కారం" లభించింది.
గత మూడు దశాబ్దాలుగా నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యం, విలువలతో కూడిన విద్య, వ్యక్తిగత వికాసం, క్రమశిక్షణ మరియు సృజనాత్మకత లాంటి అంశాల్లో వేలాది విద్యార్థులను తీర్చిదిద్దినందులకు గీతా హై స్కూల్ కు ఈ అవార్డు లభించినట్లు పాఠశాల కరస్పాండెంట్ పి. రామాంజనేయులు తెలిపారు.
ఈ రోజు హైదరాబాద్ బాగ్ లింగంపల్లి లోని ఆర్. టీ. సి కళా భవన్ లో జరిగిన అవార్డుల కార్యక్రమంలో రాష్ట్ర రవాణా మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా పాఠశాల కరెస్పాండెoట్ రామాంజనేయులు గారితో పాటు చైర్ పర్సన్ పి. ఉష, డైరెక్టర్ భరత్ లు ఈ అవార్డు అందుకున్నారు.
ఈ సందర్బంగా పాఠశాల డైరెక్టర్లు బి. రాఘవేందర్ గౌడ్, కే. నారాయణ గుప్త, మౌనిక, ఇంచార్జి ప్రిన్సిపాల్ ప్రేమ్ రాజ్, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వర్ మరియు ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేసారు.


