మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ చంద్రశేఖర్.....

మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ చంద్రశేఖర్.....

చిన్న శంకరం పేట,  మార్చి 28 ( ప్రజాస్వరం):

చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా నేడు మెగా వైద్య శిబిరాన్ని స్థానిక వైద్యాధికారి సాయి సింధు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు, ఈ వైద్య శిబిరాన్ని స్థానిక సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్ ప్రారంభించారు, అనంతరం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిసరాలను, ఆస్పత్రిలో మెడిసిన్ పంపిణీ చేసే గది, రక్త పరీక్షలు నిర్వహించే ల్యాబ్ వంటివి ఆయన పరిశీలించారు, దంత వైద్య నిపుణులు డాక్టర్ సుకేష్ ని, గైనకాలజిస్ట్ డాక్టర్ హీనా కౌసర్, జనరల్ వైద నిపుణులు డాక్టర్ అక్షయ్ కుమార్, ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ ప్రసాద్, కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఐశ్వర్య, చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సాయి వెంకటేష్, వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ సాయి సింధు సర్పంచ్ కంచర్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమం లో నేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నిపుణులైన వైద్యులచే వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని, ప్రైవేట్ ఆస్పత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రిలోనే మెరుగైన వైద్యం అందుతుందని ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిల వైపు మగ్గుచూపి నాణ్యమైన వైద్యాన్ని అందుకోవాలని వారు తెలిపారు, ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయి సింధు, డాక్టర్ హృదయ్, డాక్టర్ హారిక, డాక్టర్ నందిని, డాక్టర్ కుమారి, సర్పంచ్ చంద్రశేఖర్ ఉపసర్పంచ్ భానుప్రసాద్ తో పాటు పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.