పరిశ్రమ ముందు ఆందోళన చేపట్టిన గ్రామస్తులు ....
ఈ పరిశ్రమ మాకొద్దు...
పరిశ్రమకు సంబంధించిన పేపర్లు గ్రామపంచాయతీకి సమర్పించాలంటూ నోటీసు జారీ చేసిన పంచాయతీ కార్యదర్శి
చిన్న శంకరంపేట,ఏప్రిల్ 4 ( ప్రజాస్వరం ):
చిన్న శంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు అవుతున్న వినూత్న ఫార్మా కంపెనీ మాకు వద్దు అంటూ మిర్జాపల్లి గ్రామస్తులు కంపెనీ ముందు ఆందోళన చేపట్టారు, పరిశ్రమకు సంబంధించిన అనుమతుల పేపర్లు గ్రామపంచాయతీకి సమర్పించాలని పంచాయతీ కార్యదర్శి సంతోష్ కంపెనీ ప్రతినిధి గణేష్ కు నోటీసులు అందజేశారు. పరిశ్రమ నిర్మాణం పనులు చేస్తున్న కార్మికులను పనులు చేయొద్దంటూ గ్రామస్తులు పంపించివేశారు. ఈ సందర్భంగా మాజీ ఉపసర్పంచ్ మనోజ్ కుమార్ తో పాటు గ్రామస్తులు మాట్లాడుతూ పరిశ్రమకు ఎలాంటి అనుమతులు లేవని ఫార్మ పరిశ్రమ మా శివారులో వేయొద్దని వారు డిమాండ్ చేశారు. పరిశ్రమ పేపర్లన్నీ గ్రామపంచాయతీ కార్యాలయానికి సమర్పించే వరకు పనులు చేపట్టొద్దని, సోమవారం నిర్వహించే ప్రజావాణిలో కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు వారు తెలిపారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయంలో అనుమతులేని పరిశ్రమపై చర్యలు తీసుకుని విధంగా జిల్లా అధికారులకు నివేదిక పంపించాలంటే గ్రామస్తులు వినతి పత్రాలు అందజేశారు.


