ఈ నెల 23 నుంచి 36 వ బ్రహ్మోత్సవ సమహ్వనం....
By Prajaswaram
On
మెదక్ ,ఏప్రిల్ 04 (ప్రజాస్వరం):
మెదక్ పట్టణం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో 36 వ బ్రహ్మోత్సవ సమహ్వనం విచ్చేసిన మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధికా, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, ఆలయ కమిటీ అధ్యక్షుడు కంచి మధుసూదన్, కౌన్సిలర్స్ లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి 26 వరకు నిర్వహించినట్లు తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ దొంతి లక్ష్మీ ముత్యం గౌడ్, పబ్బ రాజమణి, మాయ గంగామణి, నాయకులు భూపతి రాజ్, దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
Latest News
04 Apr 2026 20:13:00
మాసాయిపేట ,ఏప్రిల్ 04(ప్రజాస్వరం) చెట్ల తిమ్మాయిపల్లికి చెందిన బానోత్ రాములుకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న...


