అంగన్వాడి ఎదురుగా ట్రాన్స్ పార్మర్ ను బిగించవద్దు..

ఆరో వార్డు కాలనీవాసులు....

అంగన్వాడి ఎదురుగా ట్రాన్స్ పార్మర్ ను బిగించవద్దు..

చిన్నపిల్లలచెలగాటమాడుతున్న విద్యుత్ అధికారులు...

 

తూప్రాన్ ,ఏప్రిల్ 4 (ప్రజాస్వరం ):

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

తూప్రాన్ మున్సిపాలిటీ 6వ వార్డు లక్ష్మీ గార్డెన్స్ సమీపంలోని అంగన్ వాడి కేంద్రం ఎదురుగా నూతన విద్యుత్ ట్రాన్స్ పార్మర్ ఏర్పాటు చేసి అంగన్ వాడి కేంద్రం ముందే వారి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తున్నారు. అంగన్వాడి కేంద్రం ముందు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తే చిన్నారులకు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.. అంగన్వాడీలో చదువుకునే చిన్నారులు కర్రలతో రాళ్లతో ఆడుకుంటూ ఉంటారు. ట్రాన్స్ఫార్మర్ పేలి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ప్రాణహాని జరగకముందే అంగన్వాడి కేంద్రం ముందు ట్రాన్స్ఫార్మర్ ని తొలగించాలని ఏర్పాటు చేయవద్దని ఆరో వార్డు కాలనీవాసులు కోరుచున్నారు.. విద్యుత్ అధికారులు కాంట్రాక్టర్, ఇస్తాను సారంగా పనులను నిర్వహిస్తున్నారని కాలనీవాసులో ఆందోళన చెందుతున్నారు .. ట్రాన్స్ఫార్మర్ ని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా విద్యార్థులు కు చిన్నారులకు ఇబ్బందులు కలగకుండా వేరే చోటుకు మార్చాలని చిన్నారుల తల్లిదండ్రులు కాలనీవాసులు కోరుతున్నారు. 

 

 ఆందోళన చేపడుతాం ....

 

అంగన్వాడి కేంద్రం వద్ద నుండి ట్రాన్స్ఫార్మర్ ని తొలగించకపోతే మున్సిపల్ కార్యాలయం ముందు కాలనివాసులము చిన్నాన్న తల్లిదండ్రులను అందరం కలిసి ఆందోళన చేపడుతామని వారు పేర్కొన్నారు వెంటనే పనులను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు...