తమను అడ్డుకోవడం అప్రజాస్వామికం...

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొంది రజని...

తమను అడ్డుకోవడం అప్రజాస్వామికం...

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొంది రజని ఆగ్రహాం

హౌజ్‌ అరెస్టు చేయడం హేచమైన చర్య

పోలీసులు, కాంగ్రెస్‌ నాయకుల పట్ల ధ్వజం

 

తూప్రాన్‌ ,ఏప్రిల్ 4 (ప్రజాస్వరం ) :

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

తూప్రాన్ రామాలయం లో శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించాల్సిన రథోత్సవ వేడుకలను పోలీసులతో కాంగ్రెస్‌ నాయకులు అడ్డుకోవడం అప్రజాస్వామికం అని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొంది రజని ఆగ్రహాం వ్యక్తం చేశారు. శుక్రవారం రామాలయం వద్ధ నిర్వహించాల్సిన రథోత్సవ వేడుకల సందర్భంగా కాంగ్రెస్‌ నాయకుల డైరేక్షన్‌లో పోలీసుల అత్యుత్సంను తీవ్రంగా ఖండించారు. దేవుని కార్యక్రమంలో రాజకీయ జోక్యం, ప్రజాస్వామ్యంకు అవమానకారమన్నారు. గతంలో మాదిరిగానే అనవాయితిగా వస్తున్నప్పుడు తాను కూడ రథోత్సవంపై కూర్చోవడం తప్పు ఏట్ల అవుతుందని ప్రశ్నించారు. జాతర ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చర్చ జరిగితే అప్పుడే తమ నిర్ణయం చేప్పేవాళ్లం అన్నారు. కాని కేవలం రాజకీయ కుట్రలో బాగమే అన్నారు. తమ కుటుంబ సభ్యులను రథోత్సవ వేడుకలకు హాజరు కాకుండ ఉదయమే హౌజ్‌ అరెస్టు చేయడం హేయమైన చర్య అని మండి పడ్డారు. ఎవరు ఏమి చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. వారికి రాబోవు రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని తెలిపారు.