తూప్రాన్ లో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు .....

తూప్రాన్ లో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు .....

తూప్రాన్, ఏప్రిల్ 2 (ప్రజాస్వరం): 

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

మెదక్ జిల్లా తూప్రాన్ పెద్ద చెరువు కట్టపై వెలసిన వీరాంజనేయ స్వామి ఆలయంలో గురువారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హనుమాన్ జయంతి పురస్కరించుకొని మాలాధారణ చేసిన 250 మంది హనుమాన్ మాలధారణ స్వాములతో పాటు వందలాది మంది భక్తులు వ్రత పూజల్లో పాల్గొన్నారు. కాగా 40 సంవత్సరాలుగా తూప్రాన్ వీరాంజనేయ స్వామి ఆలయం లో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాట్లు ఆత్రేయ శర్మ పేర్కొన్నారు తెలంగాణ లోనే మరో కొండా గట్టు ఆంజనేయ స్వామి ఆలయం గా ప్రసిద్ధిగాంచిన ఆలయం సంతానం వివాహాలు వ్యాపార అభివృద్ధి ఉద్యోగం లాంటి కోరికలకు కొలువైన దేవుడు వీరాంజనేయుడు అని ఆయన తెలిపారు. గురువారం ఉదయం ఆంజనేయుస్వామి చందన అభిషేకం , లక్ష ఆకుపూజ లక్ష పుష్పర్చన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు అనంతరం మహా అన్నధానం ఉంటుందని భక్తులు అధిక సంఖ్య లో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని ఆత్రేయ శర్మ కోరారు.