ఘనంగా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం.....
ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అంక్ష రెడ్డి
By Prajaswaram
On
జగదేవ్ పూర్ , ఏప్రిల్ 03, (ప్రజాస్వరం ):
జగదేవ్ పూర్ మండలం వట్టిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అంక్ష రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఇండ్లను ప్రారంభించారు. తమ సొంత ఇంటి కల నెరవేరినందుకు లబ్ధిదారులు కొత్తోజు అఖిల సురేష్ హర్షం వ్యక్తం చేస్తూ, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చింతల విద్యాధర్, మండల కాంగ్రెస్ నాయకులు రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రజిత రాజేందర్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ నాయకులు తిరుపతి రెడ్డి, అమరేందర్ రెడ్డి, మునీర్, కర్ణాకర్, నరేందర్ రెడ్డి ,సిద్దు,కనకయ్య,దుర్గయ్య ,మరియు పలువురు నాయకులు, ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Latest News
03 Apr 2026 12:41:35
జగదేవ్ పూర్ , ఏప్రిల్ 03, (ప్రజాస్వరం ): జగదేవ్ పూర్ మండలం వట్టిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. ఈ...


