మెదక్ జిల్లాకు గద్దర్ పేరు పెట్టాలి....

డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి. శంకర్ ...

మెదక్ జిల్లాకు గద్దర్ పేరు పెట్టాలి....

ప్రశ్నించే గొంతులు సాధించిన విజయాలపై జరిగే గద్దర్ ఫౌండేషన్ సభను జయప్రదం చేయండి. 

 

 తూప్రాన్ ,ఏప్రిల్ 4(ప్రజాస్వరం ) :

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

తూప్రాన్ పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో గల అంబేద్కర్. బాబు జాగ్జీవన్ విగ్రాహలవద్ద గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 6న హైదరాబాద్ లో జరిగే ప్రశ్నించే గొంతులు సాధించిన విజయాలపై రాష్ట్ర స్థాయి సభను జయప్రదం చేయాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, పిలుపునిచ్చారు. గద్దర్ ఫౌండేషన్ పోస్టర్ ను శుక్రవారం నాడు తూప్రాన్ అంబేద్కర్, జీవన్ రామ్ సర్కిల్లో విడుదల చేశారు.

 ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ మెదక్ జిల్లాకు "గద్దర్" అన్న పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ పై కాల్పులు జరిగిన రోజున గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సభను నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఈ దినాన్ని గద్దర్ పునర్జన్మ దినంగా సైతం పాటిస్తారని ఆయన అన్నారు . ఏప్రిల్ 6న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సాయంత్రం ఐదు గంటల నుండి జరిగే ప్రశ్నించే గొంతులు సాధించిన విజయాల సభకు ప్రతి ఒక్కరు హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు సామల అశోక్ కుమార్ అంబేద్కర్ సంఘం నాయకులు గజ్జల కృష్ణ.మన్నె శ్రీనివాస్, వివిధ సంఘాల నాయకులు సతీష్ ,రామ చంద్రం తదితరులు పాల్గొన్నారు.