ఘనంగా రన్ ఫర్ జీసస్ ర్యాలీ...

ఘనంగా రన్ ఫర్ జీసస్ ర్యాలీ...

మెదక్ ,ఏప్రిల్ 04 (ప్రజాస్వరం):

 

లోక రక్షకుడు యేసుక్రీస్తు పునరుత్థాన సందేశాన్ని చాటి చెబుతూ మెదక్ లో 'రన్ ఫర్ జీసస్' 2026 ర్యాలీ ని సిఎస్ఐ సంఘం ఆద్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య ప్రార్థన చేసి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ చర్చ్ నుంచి పట్టణ పుర వీధుల గుండా సాగింది. ర్యాలీ లో యువతి, యువకులు, చిన్నారులు యేసు క్రీస్తు పునరుద్ధన కోసం నినాదాలు చేస్తూ యేసు క్రీస్తు పాటలకు నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య మాట్లాడుతూ ఈస్టర్ పండుగకు ముందు వచ్చే మహా శనివారం రోజు యేసు క్రీస్తు పునరుద్ధన కోసం రన్ ఫర్ జీసస్ ర్యాలీ జరుపుతారని అన్నారు. ఈ ర్యాలీ ప్రతి సంవత్సరం సీఎస్ఐ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న, పెద్ద తేడా లేకుండా లోక రక్షకుడి తిరిగి రాకడ కోసం చేసుకోనున్న ర్యాలీ గా చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గంట సంపత్, చర్చ్ కమిటీ సభ్యులు, గురువులు పాల్గొన్నారు.

Latest News

సీఎంరిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత.... సీఎంరిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత....
మాసాయిపేట ,ఏప్రిల్ 04(ప్రజాస్వరం)   చెట్ల తిమ్మాయిపల్లికి చెందిన బానోత్ రాములుకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న...
పరిశ్రమ ముందు ఆందోళన చేపట్టిన గ్రామస్తులు ....
ఈ నెల 23 నుంచి 36 వ బ్రహ్మోత్సవ సమహ్వనం....
ఘనంగా రన్ ఫర్ జీసస్ ర్యాలీ...
రోడ్డు ను ఆక్రమించి నిర్మించిన రేకుల తొలగింపు...
మెదక్ జిల్లాకు గద్దర్ పేరు పెట్టాలి....
అంగన్వాడి ఎదురుగా ట్రాన్స్ పార్మర్ ను బిగించవద్దు..