అక్రమ అరెస్ట్ లతో ప్రశ్నించే గొంతులను ఎప్పటికి ఆపలేరు....
బీజేపీ మండల బక్క వెంకటెష్ గౌడ్....
మనోహరాబాద్, మార్చి 23 (ప్రజాస్వరం) :
అక్రమ అరెస్ట్ లతో ప్రశ్నించే గొంతులను ఎప్పటికి ఆపలేరని ఇట్టి విషయాన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాలని మనోహరబాద్ మండల బీజేపీ అధ్యక్షులు బక్క వెంకటేష్ గౌడ్ గారు అన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ, ప్రజల బతుకులను ఆగం చేస్తూ, భావితరాలను భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అరాచక, కమీషన్ల పాలనను నిలదీస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు నేతృత్వంలో "అసెంబ్లీ ముట్టడి" పిలుపుతో కార్యక్రమం లో భాగంగా బిజెపి నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది.
అరెస్ట్ చేసిన వారిలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు బక్క వెంకటేష్ గౌడ్, మాజీ మండల అధ్యక్షులు నరేందర్ చారి, మండల ఉపాధ్యక్షులు చాకలి మల్లేష్, మండల నాయకులు కుంట మహేష్ ముదిరాజ్, నాయకులు కొత్తూరు మల్లేష్ ముదిరాజ్, ఎర్ర కృష్ణ ఉన్నారు


