రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం .....
బీజేపీ నాయకులు.....
మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడానికి నిరసిస్తూ,
ప్రజాస్వరం : మనోహరాబాద్ , ఏప్రిల్ 18
నిన్న పార్లమెంట్ లో నారీ శక్తి మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడానికి నిరసిస్తూ, ఈరోజు మనోహరాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్,రాహుల్ గాంధీ యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేసిన మండల పార్టీ అధ్యక్షులు బక్క వెంకటేష్ గౌడ్, అనంతరం రాష్ట్ర నాయకులు నత్తి మల్లేష్ ముదిరాజ్ మాట్లాడుతూ భారత ప్రజాస్వామ్యంలో ఇదొక చీకటి రోజు ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు 33% రిజర్వేషన్లతో మహిళా నేతృత్వంలో అభివృద్ధికి బాటలు వేస్తుంటే కాంగ్రెస్ మరియు ఇండి కూటమి కుట్రపూరితంగా దానిని అడ్డుకొని తమ మహిళా వ్యతిరేకతను బట్టబయలు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ దృష్టిలో మహిళలంటే ఇందిరాగాంధీ, సోనియా గాంధీ,ప్రియాంక గాంధీలు మాత్రమే డిలిమిటేషన్ సాకుతో ఎక్కడ మహిళలు చట్టసభల్లో అడుగుపెట్టి బీజేపీకి ఎక్కడ క్రెడిట్ ఇస్తారు. అన్న అక్కసుతో ఈ బిల్లును నిలిపివేయడం యావత్ మహిళా లోకానికి వారి హక్కులకు జరిగిన ఘోర అవమానం రానున్న ఎన్నికల్లో మహిళలందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు కమ్మరి నరేందర్ చారి, బూత్ కమిటీ అధ్యక్షులు చిట్టి రాజు ముదిరాజ్, రితీష్ ముదిరాజ్, కాళ్లకల్ గ్రామ అధ్యక్షులు కొత్తూరు మల్లేష్ ముదిరాజ్, సీనియర్ నాయకులు రచ్చ శ్రీకాంత్, ఎర్ర కృష్ణ, సోషల్ మీడియా కన్వీనర్ మంచి గిరీష్ తదితరులు పాల్గొన్నారు.


