ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం.....

ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం.....

 ప్రజాస్వరం  : నార్సింగి, ఏప్రిల్ 16  

 

ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని రైతు వేదికలో ఇంచార్జ్ ఎంపీడీఓ చిన్నా రెడ్డి ఆధ్వర్యంలో 17 శాఖల అధికారులతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మండల ప్రత్యేక అధికారి నీలిమ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించి ప్రభుత్వ అమలు చేస్తున్న, చేయబోయే పథకాల గురించి గణాంకాలతో సహా వివరించారు. అధికారుల వివరణ అనంతరం నార్సింగి, వల్లూరు సర్పంచుల వివిధ అంశాల పై అధికారులను తమ గ్రామ సమస్యలను తెలుపుతూ పరిష్కార మార్గాల కోసం ప్రశ్నించారు. నార్సింగి సర్పంచ్ ఆకుల సుజాత మల్లేశ్ గౌడ్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల మలి విడత ఇల్లు మంజూరి కోసం గ్రామ ప్రజల నుంచి వత్తిడి పెరుగుతుందని, ఇల్లు కట్టుకోవాలని ఉత్సాహంగా ఉన్న వారికి త్వరగా ఇల్లు మంజూరు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ పింఛన్ కోసం చాలా మంది అర్హులైన వారు దరఖాస్తు చేశారని, పెన్షన్లు మంజూరు గురించి వేచి చూస్తున్నారని చెప్పగా స్పందించిన ప్రత్యేక అధికారి నీలిమ పై అధికారులకు విషయాన్ని తెలిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం వల్లూరు గ్రామ సర్పంచ్ పిప్పిరి వినోద్ కుమార్ తమ గ్రామ సమస్యల గురించి తెలుపుతూ షేర్వాల్ కంపెనీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాకుండా అర్ధంతరంగా నిలిచి పోయాయని, నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. హౌసింగ్ శాఖ డీ.ఈ యాదగిరి జవాబు చెబుతూ ఒక్కో గ్రామంలో ఒకటి రెండు ఇల్లు నిర్మాణం చేయాలంటే వారికి కూడా ఇబ్బంది అవుతుందని, ఎక్కువ ఇల్లు ఉంటే వారికి కూడా నిర్మాణాల కోసం ఇబ్బందులు కలగవని, అయినా నిర్మాణంలో నిలిచిన ఇళ్ల త్వరిత గతిన నిర్మాణాల కోసం షేర్వాల్ వారితో మాట్లాడి వెంటనే నిర్మాణాలు మొదలయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. తమ వల్లూరు గ్రామంలో మత్తు పదార్థాల వినియోగం పెరిగిందని, గ్రామ యువత మత్తు పదార్థాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని ఎస్ఐ బీమరి సృజన ను వినోద్ కోరగా మత్తు పదార్థాల నియంత్రణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తనిఖీలు చేస్తున్నామని, యువత కోసం మత్తు పదార్థాల వల్ల జరిగే అనర్థాల పై అవగాహన కల్పిస్తున్నామని, గ్రామస్తులు కూడా బాధ్యతతో సహకరించాలని ఎస్ఐ సృజన కోరారు. మొత్తం మీద గ్రామాల సమస్యలను తెలిపిన సర్పంచుల కు సమస్యల పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకుంటామని అధికారుల నుంచి వచ్చిన హామీలతో సభ ప్రశాంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గ్రేస్ బాయి, మండల వ్యవసాయ అధికారి భరత్ కుమార్, వైద్యారోగ్య అధికారి రవి కుమార్, ఆర్.డబ్లు.ఎస్ ఏ.ఈ స్వప్న, ఎం.పీ.ఓ సయీద్, ఏ.పీ.ఓ రాజేశ్వర్ గౌడ్, ఐకెపి ఏపీఎం సృజన్ కుమార్ రెడ్డి, అంగన్వాడీ సూపర్వైజర్ సుజాత, సెక్షన్ ఆఫీసర్ రామ్ లీలా, ఆర్.ఐ శ్రీధర్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, గ్రామాల సర్పంచులు, పాలక వర్గం సభ్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Latest News

తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తాం... తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తాం...
కేసీఆర్  జన్మదినాన్ని పురస్కరించుకొని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన కేసీఆర్ క్రికెట్ కప్ 8వ ఎడిషన్ పోటీల విజేతలకు చెక్‌లు, ట్రోఫీలను హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలో...
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం.....
మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం......
ఎఫ్ టి ఎల్ గుర్తించేందుకు సర్వే నిర్వహించిన అధికారులు...
ఇంటర్ లో రాష్ట్ర స్థాయి లో నిలిచిన విద్యార్థుల కు సన్మానం.....  
రేషన్ షాపుల్లో అక్రమాలు చేస్తే కఠిన చర్యలు ....
కుండ భానుచందర్ కు దళిత రత్న అవార్డు....