తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తాం...

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తాం...

కేసీఆర్  జన్మదినాన్ని పురస్కరించుకొని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన కేసీఆర్ క్రికెట్ కప్ 8వ ఎడిషన్ పోటీల విజేతలకు చెక్‌లు, ట్రోఫీలను హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలో కేటీఆర్ అందజేశారు.ఈ సందర్భంగా కేటీఆర్  మాట్లాడుతూ తెలంగాణలో సమగ్ర క్రీడా పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉందని, వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేయడంతో పాటు క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేసీఆర్ క్రికెట్ కప్ స్ఫూర్తితో వచ్చే ఏడాది కేసీఆర్  పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తామనిప్రకటించారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ గులాబీ శ్రేణులను, కాకతీయ క్రికెట్ అకాడమీ సభ్యులను అభినందించారు.ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్  మాట్లాడుతూ కేసీఆర్  జన్మదినాన్ని పురస్కరించుకొని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో గత 8 ఏండ్లుగా కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. హనుమకొండ జిల్లా పరిధిలోని పేద క్రీడాకారులకు చేయూతనందిస్తున్నామని పేర్కొన్నారు.పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను, టోర్నమెంట్ నిర్వహణకు సహకరించిన కాకతీయ క్రికెట్ అకాడమీ బృందాన్ని అభినందించారు.విజేతలకు చెక్‌లు, ట్రోఫీల ప్రదానం కేసీఆర్ క్రికెట్ కప్ 8వ ఎడిషన్ పోటీల్లో టోర్నీ విన్నర్‌గా నిలిచ�

Latest News

తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తాం... తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తాం...
కేసీఆర్  జన్మదినాన్ని పురస్కరించుకొని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన కేసీఆర్ క్రికెట్ కప్ 8వ ఎడిషన్ పోటీల విజేతలకు చెక్‌లు, ట్రోఫీలను హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలో...
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం.....
మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం......
ఎఫ్ టి ఎల్ గుర్తించేందుకు సర్వే నిర్వహించిన అధికారులు...
ఇంటర్ లో రాష్ట్ర స్థాయి లో నిలిచిన విద్యార్థుల కు సన్మానం.....  
రేషన్ షాపుల్లో అక్రమాలు చేస్తే కఠిన చర్యలు ....
కుండ భానుచందర్ కు దళిత రత్న అవార్డు....