మేడ్చల్ లో ఘనంగా పవర్ లిఫ్టింగ్ పోటీలు.....
మేడ్చల్, ఏప్రిల్ 6 (ప్రజాస్వరం):
మేడ్చల్ లోని పవర్ ఫిట్నెస్ జిమ్‌లో ఆదివారం WPC తెలంగాణ ఓపెన్ జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ (డెడ్‌లిఫ్ట్ & బెంచ్ ప్రెస్) ఆధ్వర్యంలో పవర్ ఫిట్నెస్ జిమ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలు ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగాయి.ఈ సందర్భంగా పవర్ ఫిట్నెస్ యజమాని కేశవ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం WPC నేషనల్ ఛాంపియన్‌షిప్ రేఖ ఆధ్వర్యంలో జరిగాయని,వివిధ ప్రాంతాల నుంచి, ముఖ్యంగా కర్నూలు జిల్లాకు చెందిన క్రీడాకారులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నాట్లు ఆయన తెలిపారు.
గెలుపొందిన విజేతలకు మాజీ కౌన్సిలర్ రామన్న గారి మణికంఠ గౌడ్ 10 వేల నగదు ను బహుమతులుగా స్పాన్సర్ చేశారని,
పవర్ ఫిట్నెస్ జిమ్‌కు చెందిన పలువురు క్రీడాకారులు కూడా ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో B Fit జిమ్‌కు చెందిన బంటి తో పాటు ముఖ్య అతిథులుగా ఎల్లంపేట్ మున్సిపల్ కౌన్సిలర్ వాచపల్లి ఆర్చన శ్రీనివాస్,సటే నరేందర్,స్వామి యాదవ్,మహిపాల్ రెడ్డి, రాజు గోపాల్, ఆర్మేందర్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన WPC టీమ్ మరియు పవర్ ఫిట్నెస్ జిమ్ టీమ్‌కు పలువురు కృతజ్ఞతలు తెలిపారు.


