పూడూరు కలగా వెంకటేష్ శర్మకు అర్చక అవార్డు.....
By Prajaswaram
On
మేడ్చల్, ఏప్రిల్ 6(ప్రజాస్వరం):
మేడ్చల్ సర్కిల్ పరిధి పూడూరు గ్రామానికి చెందిన అర్చక గురుస్వామి కలగా వెంకటేష్ శర్మకు అయ్యప్పస్వామి జయంతి పురస్కరించుకుని రాష్ట్ర అయ్యప్ప స్వామి సేవార్తి ఐక్యవేదిక ఆధ్వర్యంలో అవార్డు,ప్రశంసాపత్రం అందజేశారు.ఈ సందర్భంగా శంకరాచార్య పుష్పగిరి మహసంస్థాన పీఠాధీశ్వరులు శంకరభారతి స్వామి నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో వెంకటేష్ శర్మను ఘనంగా సన్మానించి ఉత్తమ అర్చక ప్రశంసా పత్రం అందజేశారు.అయ్యప్ప సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తున్న తన సేవలను గుర్తించి ఈ అవార్డు అందజేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు.భవిష్యత్తులో సైతం మరెన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి ఇలాంటి అవార్డులు దోహదపడతాయని వెంకటేష్ శర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు.కాగా వెంకటేష్ శర్మకు పలువురు గ్రామస్తులు అభినందనలు,శుభాకాంక్షలు తెలియజేశారు.
Latest News
06 Apr 2026 20:56:56
మేడ్చల్, ఏప్రిల్ 6 (ప్రజాస్వరం): మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ గ్రామం లో యూపీఎస్ ఎల్లంపేట్ స్కూల్ లో సుమారు 150 మంది స్టూడెంట్స్ కి ఎల్లంపేట కౌన్సిలర్...


