రేషన్ షాపుల్లో అక్రమాలు చేస్తే కఠిన చర్యలు ....
జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద ...
ప్రజాస్వరం : తూప్రాన్ ,ఏప్రిల్ 15
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం లోని ఇస్లాంపూర్ గ్రామం లో గల చింతల వెంకట నర్సయ్య గౌడ్ కు చెందిన రేషన్ షాప్ నెంబర్ 1743006 పై విజిలెన్సు ఎన్ఫోర్స్మెంట్ టీం-2, హైదరబాద్ వారు , జిల్లా పౌర సరఫరా అధికారులు బుధవారం నాడు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీ లలో రేషన్ షాప్ ఉండవలసిన బియ్యం కంటే 12.68 క్వింటాల రేషన్ బియ్యం అధికంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.దీనిపై సంబదిత డీలర్ పై EC, ACT-1955 నిబందనల ప్రకారం 6-A కేసు నమోదు చేయడం జరిగింది.తదుపరి రేషన్ కార్డు లబ్దిదారులకు ప్రభుత్వ రేషన్ బియ్యం పంపిణి లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి రేషన్ షాప్ 1743006 ను తూప్రాన్ మండలం దాతార్ పల్లి కి చెందినా రేషన్ డీలర్ మేకల ప్రవీణ్ కుమార్ కి (1743008) అదనపు బాద్యతలు ఇవ్వడం జరిగింది.అదే విదంగా రేషన్ షాప్ డీలర్లు బావిష్యతులో ఎలాంటి అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తిస్కోనబడతాయని జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద హెచ్చరించారు.


