గ్రామ సభలో రోడ్డు భద్రత పై అవగాహన...

సిఐ రంగా కృష్ణ ....

గ్రామ సభలో రోడ్డు భద్రత పై అవగాహన...

తూప్రాన్, ఏప్రిల్ 13( ప్రజాస్వరం ): 

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామసభ లో గ్రామస్థులకు రోడ్డు భద్రత సైబర్ నేరాలు బెట్టింగ్ ల జోలికి వెళ్లొద్దని అవగాహన కల్పించిన తూప్రాన్ సిఐ రంగా కృష్ణ  4వ దశ” కార్యక్రమంలో భాగంగా, తూప్రాన్ మండలంలోని మల్కాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు గ్రామ సభను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామస్థుల సహకారంతో గ్రామ రోడ్డు భద్రత కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ గ్రామ సభలో తూప్రాన్ సీఐ రంగా కృష్ణ , ఎస్‌ఐ గంగారాజు ,తూప్రాన్, వి.పి.ఓ, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సభలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యత, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలు, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ వినియోగం వంటి అంశాలపై వివరంగా అవగాహన కల్పించిన పోలీసులు 

గ్రామంలో ఉన్న ప్రధాన రహదారులను పరిశీలించి, ప్రమాదాలకు కారణమయ్యే గుంతలను గుర్తించి, వాటిని మట్టితో పూడ్చడం జరిగింది. అలాగే రోడ్డు పక్కన పెరిగిన పొదలు మరియు చెట్ల కొమ్మలను తొలగించి, వాహనదారులకు స్పష్టమైన దృశ్యం కల్పించేలా చర్యలు తీసుకోబడ్డాయి.

ఈ సందర్భంగా గ్రామస్తులకు రోడ్డు భద్రతపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. గ్రామస్థులు కూడా ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించి, రోడ్డు భద్రత చర్యల్లో భాగస్వాములు అవుతామని వారు తెలిపారు.

Latest News

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి..... ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.....
మాసాయిపేట, ఏప్రిల్ 13 (ప్రజాస్వరం) :   మాసాయిపేట మండలంలోని చెట్లతిమ్మాయిపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక వివిధ గ్రామాల సర్పంచ్...
రోడ్డు నియమాలు పాటించండి - ప్రమాదాలను నివారించండి....
కొనుగోలు కేంద్రం ఏర్పాటు....
అరైవ్ అలైవ్ కార్యక్రమం....
గ్రామ సభలో రోడ్డు భద్రత పై అవగాహన...
మున్సిపాలిటీలో అంగన్ వాడి టీచర్లకు మొబైల్ లు పంపిణి..
కుల రహిత సమాజాన్ని నిర్మిద్దాం....