మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం......
By Prajaswaram
On
ప్రజాస్వరం : మాసాయిపేట ,ఏప్రిల్ 16
నిర్లక్ష్యం కారణంగా భగీరథ నీళ్లు కాస్త వృధాగా పారుతున్నాయి. మండలంలోని పలు గ్రామాల్లో ప్రతి ఇంటికి మంచినీళ్లు అందాల్సిన నీళ్లు కాస్త వృధాగా పారసాగాయి. మాసాయిపేట మండలం కేంద్రంలో 44 నేషనల్ హైవే రోడ్డు పక్కనే మిషన్ భగీరథ పైపు నుంచి వాటర్ వృధాగా పోతున్నాయి.గ్రామాలలో తాగునీరు అందక ప్రజలు అల్లాడుతుంటే అధికారుల నిర్లక్ష్యం కారణంగా భగీరథ నీళ్లు వృధా అవుతున్నాయి. దీనికి ముఖ్యంగా అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే ప్రధాన కారణం అంటూ స్థానికులు చెబుతున్నారు. ఈ విషయమై సంబంధిత మిషన్ భగీరథ అధికారులకు తెలియజేసిన పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భగీరథ నీళ్లు వృధా కాకుండా ప్రతి గ్రామానికి, ప్రతిరోజు భగీరథ నీళ్లు అందించే విధంగా చర్యలు చేపట్టాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
Latest News
16 Apr 2026 21:05:44
కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన కేసీఆర్ క్రికెట్ కప్ 8వ ఎడిషన్ పోటీల విజేతలకు చెక్‌లు, ట్రోఫీలను హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలో...


