టోకెన్ల ద్వారా రేషన్ బియ్యం పంపిణీ..

తహసిల్దార్ గ్రేస్ బాయి ....

టోకెన్ల ద్వారా రేషన్ బియ్యం పంపిణీ..

నార్సింగి, ఏప్రిల్ 07 ( ప్రజాస్వరం ):

 

నార్సింగి మండలం లోని అన్ని రేషన్ దుకాణాలలో మూడు నెలల బియ్యం టోకెన్ పద్ధతి ద్వారా సజావుగా సాగుతుందని తహసీల్దార్ గ్రేస్ బాయి తెలిపారు. మంగళవారం తహసీల్దార్ గ్రేస్ బాయి, కార్యాలయ సిబ్బంది తో పాటు మండలం లో విస్తృతంగా పర్యటిస్తూ పలు అంశాల పై తనిఖీ నిర్వహించారు. నార్సింగి, వల్లూరు, జప్తి శివునూరు, శంఖాపూర్ గ్రామాల లోని రేషన్ దుకాణాలను తనిఖీ చేసి స్టాకు రిజిస్టర్, బియ్యం పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ప్రభుత్వం తరపున రేషన్ కార్డు దారులకు ఈ నెలలో మూడు నెలల కు సంబంధించి బియ్యం సరఫరా చేస్తున్నారని, మండల లోని అన్ని రేషన్ దుకాణాలలో మూడు నెలలకు సరిపడా బియ్యం సరఫరా జరిగిందని తెలిపారు. రేషన్ డీలర్లు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరతగతిన, టోకెన్ పద్ధతి లో మాత్రమే బియ్యం సరఫరా చేయాలని నిర్దేశించారు. సరఫరా లో అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ వారించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ ఐ ఆర్) జనాభా లెక్కలు 2027 కోసం వల్లూరు గ్రామంలో హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ (హెచ్.ఎల్.బీ) చేయడం కోసం ఆర్.ఐ, ఏ.ఎస్.ఓ పంచాయతీ కార్యదర్శి, జీ.పీ.ఓ, బీ.ఎల్.ఓ లతో పాటు క్షేత్ర స్థాయి పరిశీలన పరిశీలన నిర్వహించారు. జనాభా లెక్కల ప్రక్రియ సజావుగా సాగడానికి, ఏ ఇల్లు వదలకుండా, ప్రతీ ఇంటి వరకు సిబ్బంది వెళ్లి అన్ని వివరాలను నమోదు చేయడానికి వీలుగా ఇండ్లను బ్లాకుల వారిగా విభజిస్తున్నాని తెలిపారు. పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో జరుగుతున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. పరీక్షకు హాజరుతున్న విద్యార్థుల వివరాలు, అందిస్తున్న సౌకర్యాలు, పరీక్షా సరళి ను ఈ సందర్భంగా పర్యవేక్షించారు. అనంతరం పట్టణ కేంద్రం లోని అగ్రోస్ రైతు యూరియా దుకాణాన్ని తనిఖీ చేస్తూ రిజిస్టర్ లో నమోదు ఉన్న స్టాకు నిలువ ఉన్న స్టాకు ను పరిశీలించారు. రైతులకు అవసరమైన యూరియా, ఫెర్టిలైజర్, మందులు విక్రయించి నప్పుడు ఖచ్చితంగా రసీదు ఇవ్వాలని, స్టాక్ రిజిస్టర్ ను పక్కాగా నిర్వహించాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా వితరణ జరగాలని కేంద్రం నిర్వాహకులకు సూచించారు.