కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిని చేసిన సర్పంచ్, ఉపసర్పంచ్ ...
నార్సింగి, ఏప్రిల్ 07 ( ప్రజాస్వరం ):
కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ ప్రతీ ఆడపిల్లకు ఒక వారం లాంటిదని నార్సింగి సర్పంచ్ ఆకుల సుజాత మల్లేశ్ గౌడ్ అన్నారు. మండల కేంద్రం లోని రైతు వేదికలో తహసీల్దార్ గ్రేస్ బాయి ఆధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆకుల సుజాత, ఉపసర్పంచ్ యెన్నం రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజాత, రాజేందర్ రెడ్డిలు మాట్లాడుతూ నార్సింగి పట్టణ కేంద్రానికి చెందిన 25 లబ్ధిదారులకు, మొత్తం 25,02,900 విలువ గల కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పంపిణీ చేయడం తమకు ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. ఈ పథకం ఒక వరం లాంటిదని, ఆడ బిడ్డల పెళ్లి కోసం ఎంతో దోహద పడుతుందని అన్నారు. ప్రభుత్వం తరపున వచ్చిన ఈ నిధులను వృథా కాకుండా సద్వినియోగం చేసుకొవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కి కట్టుబడి ఉన్నదని, ఎన్నికలలో ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేస్తుందని అన్నారు. కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను మంజూరు చేసినందుకు లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డికి కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఆకుల మల్లేశ్ గౌడ్, వార్డు సభ్యుడు బాచి స్వామి, ఆర్.ఐ శ్రీధర్, జీపీఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


