ఎస్ఎస్సి స్పాట్ సెంటర్ లో నిరసన.....
మెదక్, ఏప్రిల్ 07 (ప్రజాస్వరం):
టీటీజెఏసి యుఎస్బిసి జాక్టో ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కేంద్రం లో ఉపాధ్యాయ సంఘాల తరఫున మంగళవారం మధ్యాహ్న భోజన విరమణ సమయంలో ఎస్ఎస్సి స్పాట్ సెంటర్ లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ 2025లో నిర్వహించిన ఎస్ఎస్సి స్పాట్ మూల్యాంకనానికి సంబంధించిన రెమ్యూనరేషన్ వెంటనే చెల్లించాలని అన్నారు. అక్టోబర్ 2024 లో నిర్వహించిన కులగన రెమ్యూనరేషన్ వెంటనే చెల్లించి, గత ఏడు సంవత్సరాలుగా ఎస్ఎస్సి స్పాట్ రెమ్యూనరేషన్ పది రూపాయలు ఉందని దీన్ని వెంటనే సవరించాలని తెలిపారు. ప్రస్తుత సంవత్సరంలో నిర్వహిస్తున్న ఎస్ఎస్సి స్పాట్ మూల్యాంకనానికి సంబంధించిన రెమినేషన్ను వెంటనే చెల్లించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సతీష్ కుమార్, రాజగోపాల్ గౌడ్, పద్మారావు, శ్రీనివాస్, ప్రణీత్ కుమార్, యాదగిరి, వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


