జూదం పై మెదక్ పోలీసుల ఉక్కుపాదం...

జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు...

జూదం పై మెదక్ పోలీసుల ఉక్కుపాదం...

ఏడుగురు అరెస్ట్, 46,720 నగదు స్వాధీనం....

 

మెదక్ ,ఏప్రిల్ 09 (ప్రజాస్వరం):

 

మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాచవరం గ్రామంలో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించి ఏడుగురిని అరెస్ట్ చేశారు. గ్రామంలోని దేవినేని రమేష్ నివాసంలో జూదం జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులతో కలిసి సంయుక్తంగా ఈ దాడి చేపట్టారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 46,720 నగదు, 7 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన పై మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జిల్లాలో ఎక్కడైనా జూద కార్యకలాపాలు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు హెచ్చరించారు. అక్రమ కార్యకలాపాలపై ప్రజలు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు.

Latest News

గ్రామీణ ప్రాంత విద్యార్థిని అక్షర కు రాష్ట్ర స్థాయి ర్యాంక్ .... గ్రామీణ ప్రాంత విద్యార్థిని అక్షర కు రాష్ట్ర స్థాయి ర్యాంక్ ....
తూప్రాన్ ,ఏప్రిల్ 12 (ప్రజాస్వరం ) : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి    మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నాగుల పల్లి గ్రామానికి చెందిన అక్కంగారి అక్షర కు...
సంబంధిత ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలి....
ఇంటర్మీడియట్ ఫలితాల్లో సత్తా చాటిన 'స్ఫూర్తి' విద్యార్థులు...
తూప్రాన్ ఓ విందులో గొంతులో మాంసం ముక్క... 
గీతా జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారు... 
నవవధువు వివాహానికి పుస్తె మట్టెలు అందజేతా ....
న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు....