సంబంధిత ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలి....
తెలంగాణ జాగృతి జిల్లా నాయకులు రమేష్ గౌడ్...
కళాశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి....
నేడు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాం....
మెదక్ ,ఏప్రిల్ 12 (ప్రజాస్వరం):
మెదక్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో వెంటనే విద్యార్థులకు మౌలిక వసతులు సౌకర్యాలు కల్పించాలని నాణ్యమైన భోజనం, పరిశుభ్రతపై సమస్యలపై వెంటనే పరిష్కరించాలని తెలంగాణ జాగృతి జిల్లా నాయకులు రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు ఆదివారం మెదక్ జిల్లా కేంద్రంలో తెలంగాణ జాగృతి జిల్లా నాయకులు రమేష్ గౌడ్ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నర్సింగ్ కళాశాలలో విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కూడా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. 120 మంది విద్యార్థులకు ఒకే టాయిలెట్ ఉండటం దురదృష్టకరమని అన్నారు. అలాగే విద్యార్థులకు నాణ్యతలేని ఆహారం అందిస్తున్నారని, కూలిపోయిన కూరగాయలతో వంటలు చేస్తున్నారని మండిపడ్డారు. కళాశాలలో డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. విద్యార్థుల నుంచి అదనపు మిస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను బెదిరించడం, భయభ్రాంతులకు గురి చేయడం మానుకోవాలని హెచ్చరించారు.వారం రోజుల్లోనే కళాశాలలో అన్ని మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలని ప్రభుత్వం, అధికారులకు గడువు విధించారు. లేదంటే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భారీ ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు ప్రస్తుతం ప్రభుత్వం సరైన సదుపాయాలు కల్పించడం లేదని విమర్శించారు. విద్యార్థులు మంచి శిక్షణ పొందితే భవిష్యత్తులో సమాజానికి మెరుగైన సేవలు అందిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మల్లేశం ఎల్లం వెంకటి లింగేష్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు


