ప్రజల చిరకాల కోరిక నెరవేరుతోంది.....
శ్రీనివాస్ గౌడ్...
జగదేవ్ పూర్, ఏప్రిల్ 09 (ప్రజాస్వరం ):
జగదేవపూర్ మండల కేంద్రంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. స్థానిక నాయకులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామంలోని వినాయకుని గుడి నుండి ఎల్లమ్మ గుడి వరకు నూతన డ్రైనేజీ నిర్మాణ పనులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామస్తుల చిరకాల కోరికైన మురుగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. నాణ్యతతో కూడిన పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను, కాంట్రాక్టర్లను కోరారు. ఈ డ్రైనేజీ నిర్మాణంతో వీధుల్లో మురుగునీరు నిలవకుండా, వర్షాకాలంలో ఇబ్బందులు కలగకుండా శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఉప సర్పంచ్ గణేష్,బత్తిని శ్రీనివాస్,ఇస్మాయిల్,భాస్కర్,దండే వెంకట్ , బాబు , అనిత శేఖర్ ,బాల నరసయ్య ,విష్ణు ప్రియ మల్లేశం ,మంజుల బాల్ నర్సయ్య ,మౌనిక నరసింహులు,సంధ్య సాయి,శ్రీలత చంద్రం ,ఆంజనేయులు ,బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు బుద్ధ నాగరాజు ,శ్రీనివాస్ రెడ్డి ,వంశీ గౌడ్, ఈవో రామ్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.


