భక్తిశ్రద్ధలతో పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి ఆర్థిక సహకారం...

నర్ర రవీందర్...

భక్తిశ్రద్ధలతో పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి ఆర్థిక సహకారం...

జగదేవ్ పూర్ ,ఏప్రిల్ 09 (ప్రజాస్వరం ):

 

జగదేవ్‌పూర్ మండలం, పలుగుగడ్డ గ్రామంలో అత్యంత వైభవంగా నిర్మితమవుతున్న శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణ పనులకు విరాళాల ప్రవాహం కొనసాగుతోంది. ఈ పుణ్యకార్యంలో భాగస్వాములు కావాలనే సంకల్పంతో, నర్ర రవీందర్ గారు తన వంతు సహాయంగా ₹11,116/- (పదకొండు వేల నూట పదహారు రూపాయలు) నగదును ఆలయ కమిటీకి అందజేశారు.

దైవ కార్యానికి మరియు గ్రామ అభివృద్ధికి అండగా నిలిచిన నర్ర రవీందర్ గారి సేవా దృక్పథాన్ని గ్రామ పెద్దలు, భక్తులు మరియు ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు. ఆలయ నిర్మాణం త్వరతగతిన పూర్తి కావాలని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో ,గ్రామ పెద్ద మనిషి నర్ర ఇస్తారీ, ఉప పెద్ద మనిషి లింగాల రామచంద్రం గ్రామ సర్పంచ్ కనకయ్య, పలుగుగడ్డ గ్రామ ఉప సర్పంచ్ కళ్యాణి రాజ్ కుమార్, పిట్టల అంజయ్య ఎల్మ వెంకటేష్ సర్రా నర్సింలు, పెద్ద కనకయ్య, లింగాల కనకయ్య, గువ్వ రమేష్, కనకయ్య, జహంగీర్, కనకయ్య,తదితరులు పాల్గొన్నారు.