బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే...
బోయిని విక్రమ్, గంట రాజు, భువనగిరి శంకర్ కుటుంబాల పరామర్శ..
బాధితులకు మనోధైర్యం నింపిన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు...
మెదక్, ఏప్రిల్ 09 (ప్రజాస్వరం):
మెదక్ పట్టణానికి చెందిన పలువురు ఇటీవల మరణించారు, వారి కుటుంబాలను గురువారం మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు పరామర్శించారు. ఇటీవల మృతి చెందిన కాంగ్రెస్ నాయకుడు బోయిని విక్రమ్, మాజీ ఏఎంసీ చైర్మన్ గంట రాజు, అలాగే టీ న్యూస్ విలేకరి భువనగిరి చంద్రశేఖర్ తండ్రి భువనగిరి శంకర్ కుటుంబ సభ్యులను గురువారం ఎమ్మెల్యే సందర్శించారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు మనోధైర్యం నింపుతూ, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఎమ్మెల్యే వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు ఎం గంగాధర్, మున్సిపల్ కౌన్సిలర్లు మన్సూర్, శివరామకృష్ణ, మాజీ కౌన్సిలర్ సమీయొద్దీన్, నాయకులు ఆవారి చంద్రశేఖర్, బాలకృష్ణ, బాలరాజు యాదవ్, సిద్ధిరాములు, ఎండి మైసన్ తదితరులు పాల్గొన్నారు.


