తూప్రాన్ మున్సిపల్ లో కేసీఆర్ వేశాధారణ తో పర్యటన...

అభివృద్ధి కోసం ప్రజల వినతిపత్రం ....

తూప్రాన్ మున్సిపల్ లో కేసీఆర్ వేశాధారణ తో పర్యటన...

 తూప్రాన్ ,ఏప్రిల్ 9 (ప్రజాస్వరం) :

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

తూప్రాన్ మున్సిపల్ పరిధి వెంకటాపూర్ లో కేసీఆర్ వేశాధారణ తో పర్యటన అభివృద్ధి కోసం వినతిపత్రం అందజేసిన గ్రామస్తులు. 

గజ్వేల్ ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగారికి నమస్కరించి.  వ్రాయునది అయ్యా మా మనవి ఏమనగా మేము గజ్వేల్ నియోజకవర్గం లో తూప్రాన్ మండల ప్రజలం తమరితో మనవి చేయునది ఏమనగా మా తూప్రాన్ మండల సమస్యలు మీ దృష్టికి తీసుకువస్తున్నాము పరిష్కరించగలరని నిధులు మంజూరు చేయగలరని కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి చాటింపు చేయించారు. సమస్య లు తీర్చాలని మా యొక్క మనవి మా తూప్రాన్ సమస్యలు తూప్రాన్ డివిజన్ గా ఏర్పడినప్పటి నుండి ఎన్నో అదనపు భవనాల మంజూరు కోసం ఎదురుచూస్తున్నాం .1)సీసీ రోడ్లు2) డ్రైనేజీలు 3)కరెంటు స్తంభాలు 4)డిగ్రీ కళాశాల 5)మంజూరైన కోర్టు ఏర్పాటుకు కృషి చేయగలరు 6)మధ్యలో ఆగిపోయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కు నిధులు మంజూరు చేసి పూర్తి చేయగలరు.7) తూప్రాన్ రింగ్ రోడ్డు ఆగిపోయింది. వాటికి నిధులు మంజూరు చేయగలరు 8) అగ్ని ప్రమాదాల సమయంలో ఫైర్ స్టేషన్ లేక ఇబ్బందిగా ఉంది ఫైర్ స్టేషన్ మంజూరు చేయగలరు 9)అర్బన్ PHC ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయగలరు 10)ఎక్సైజ్ ఆఫీస్ తూప్రాన్ లో ఏర్పాటు చేయగలరు .

11)ఐ సి డి ఎస్  ఏర్పాటు చేయగలరు.

12) బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి చాలా అవసరం ఎందుకంటే తూప్రాన్ డివిజన్ గా అభివృద్ధి చెందుతుంది కాబట్టి రైల్వే స్టేషన్ అభివృద్ధి ఎంతైనా అవసరం ఉంది . రైలు రాకపోకలు ఎక్కువ అయినందున రైల్వే బ్రిడ్జి ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు .

ఎమ్మెల్యే హోదాలో ఎంపీ 

గారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తారని 

కోరుతున్నాం.13)భారీ వర్షాలకు కిష్టాపూర్ , గుండ్రెడ్డిపల్లి గ్రామాలకు వెళ్లే దారి మధ్యలో ఉన్న చెక్ డాంల వద్ద ఉన్న రహదారులు ధ్వంసం అయినాయి ప్రతి సంవత్సరము ఇబ్బందిగా ఉన్నది కాబట్టి ఆ గ్రామాలకు వెళ్లే రహదారులపై బ్రిడ్జి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది .

14)తూప్రాన్ డంపింగ్ యార్డ్ సమస్యలు పరిష్కరించగలరు .

15)హైటెక్ అంగులతో ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వ స్కూలు మంజూరు అవుతున్న సందర్భంగా మా తూప్రానికి అన్ని హంగులతో ప్రభుత్వ స్కూలు మంజూరు చేయాలని కోరుతున్నాం దానికి సంబంధించిన ప్రభుత్వ స్థలము కూడా ఉన్నది .

16)రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాలు ఏర్పాటు అవుతున్న సందర్భంగా మా తూప్రాన్ ను కూడా నియోజకవర్గంగా ఏర్పాటు కు కృషి చేయాల్సిన బాధ్యత మీపై ఉన్నందున మీ దృష్టికి తీసుకు వస్తున్నాం17)గ్రామాల మధ్య డాంబర్ రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ,18)

మున్సిపల్ లో విలీనమైన గ్రామాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేయించి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కోరుతున్నాము

సమస్యలు ఇంకా ఎన్నో ఉన్న వాటిలో ముఖ్యమైనవి మీ దృష్టికి తీసుకు వస్తున్నాము దయచేసి ఈ సమస్యలను 

గజ్వేల్ ఎమ్మెల్యే హోదాలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తారని నిధులు మంజూరు చేయిస్తారని ఆశిస్తున్నాం  

గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిపించి మిమ్మల్ని 

నేరుగా కలవలేక మీకు ఓటు వేసిన పాపానికి మీ చిత్రపటానికి ఈ దరఖాస్తు ఇస్తున్నందుకు గజ్వేల్ నియోజకవర్గ ప్రజలుగా మేము చింతిస్తున్నాం.

గజ్వేల్ నియోజకవర్గం లోని తూప్రాన్ మండల ప్రజలు