అతి వేగంతో వచ్చి ఆటోను,స్కూల్ బస్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్...
By Prajaswaram
On
మేడ్చల్, ఏప్రిల్ 9 (ప్రజాస్వరం):
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కండ్లకోయ వద్ద అతి వేగంతో వస్తున్న ఆర్టీసీ బస్ ఆటో తో పాటు రోడ్డు దాటుతున్న స్కూల్ బస్ ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా,బస్ లోని విద్యార్థి కి తీవ్ర గాయాలయ్యాయి.గాయాలైన వారిని ఆసుపత్రి తరలించారు. డ్రైవర్ అతివేగం వాళ్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రయాణికులు తెలిపారు. ఆర్టీసీ డ్రైవర్లకు ట్రాఫిక్ పొలిస్ లు అవగాహన కల్పించినప్పటికి ఆర్టీసీ డ్రైవర్ల తీరు మాత్రం మారట్లేదని, అతివేగంతో తో ఆర్టీసీ బస్ ను నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్ నర్సయ్య పై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. డ్రైవర్ల కు సరైన అవగాహన కల్పించి ప్రమాదాలు జరగకుండా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
Latest News
09 Apr 2026 21:46:27
మేడ్చల్, ఏప్రిల్ 9 (ప్రజాస్వరం): మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కండ్లకోయ వద్ద అతి వేగంతో వస్తున్న ఆర్టీసీ బస్ ఆటో తో పాటు రోడ్డు దాటుతున్న...


