గీతా జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారు...
తూప్రాన్ ,ఏప్రిల్ 12( ప్రజాస్వరం):
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలలో మెదక్ జిల్లా తూప్రాన్ గీతా జూనియర్ కాలేజ్ విద్యార్థులు అద్భుతమైన మార్కులతో రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారు.
ప్రథమ సంవత్సరం ఎం. పి. సి. విభాగంలో జి. రిషిక, ఎల్. అజయ్, ఎం. లక్ష్మి భవానిలు 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించగా, ద్వితీయ సంవత్సరం ఎం. పి. సి. విభాగంలో 1000 మార్కులకు గాను 992 మార్కులతో వి. వినయశ్రీ రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారు.
అలాగే బై. పి. సి. ప్రథమ సంవత్సరం విభాగంలో వై. పవన్ కుమార్ , కె. చైత్ర శ్రీ, ఏ. మనస్వినిలు 440 మార్కులకు గాను 436 మార్కులతోనూ, ద్వితీయ సంవత్సరం విభాగంలో 1000 మార్కులకు గాను 992 మార్కులతో సి. హెచ్. మహేష్ రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారు.
సి. ఇ. సి. విభాగంలో డి. జాషువా 500 మార్కులకు గాను 472 మార్కులు సాధించగా, ద్వితీయ సంవత్సరం విభాగంలో సయ్యద్ సాజిద్ 1000 మార్కులకు గాను 960 మార్కులు సాధించారు. అలాగే ఎం. ఇ. సి. ప్రథమ సంవత్సరంలో లోహితా శరణ్య 500 మార్కులకు గాను 479 మార్కులు సాధించారు.
ఈ సందర్బంగా కళాశాల కరస్పాండెంట్ పి. రామాంజనేయులు, చైర్ పర్సన్ పి.ఉష, డైరెక్టర్లు పి.భరత్, డాక్టర్ పి. మౌనిక,
ప్రిన్సిపాల్ టి. రాజు, ఇంచార్జి ప్రిన్సిపాల్ సుధారాణి, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రావు మరియు అధ్యాపక బృందం, తల్లిదండ్రులు విద్యార్థులకు అభినందనలు తెలియ జేశారు.


