న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు....
మేడ్చల్, ఏప్రిల్ 11 (ప్రజాస్వరం):
న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ శ్యామ్ కొషి ఆదేశాల మేరకు తెలంగాణ న్యాయ సెక్రటరీ పంచాక్షరీ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సును మేడ్చల్ మండలం లోని కండ్లకోయ,గౌడవెళ్లి గ్రామాలలో సంచార వాహనం లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో రాజ్యాంగం అందరికి సమాన హక్కులు కల్పించిందని అన్నారు. వృద్ధుల సంరక్షణ మరియు సంక్షేమానికి సంబంధించిన చట్టాలు, పథకాల గురించి అవగాహన కల్పించడం, సమాజంలోని బలహీన వర్గాలకు హక్కులు, గిరిజన హక్కులు, బాల్యవివాహాలు, బాలకార్మిక చట్టాలు, న్యాయపరమైన రక్షణ, చట్టపరమైన అవగాహన, చట్టాల పై ఉచిత న్యాయ సహాయం ఎలా పొందాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సదస్సులో న్యాయ సేవధికార సంస్థ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రాజు,మేడ్చల్ ఏడవ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ వి. శ్రావణి యాదవ్ తో పాటు న్యాయవాదులు, ప్రజలు పాల్గొన్నారు.


