ఇంటర్మీడియట్ ఫలితాల్లో సత్తా చాటిన 'స్ఫూర్తి' విద్యార్థులు...

ఇంటర్మీడియట్ ఫలితాల్లో సత్తా చాటిన 'స్ఫూర్తి' విద్యార్థులు...

మేడ్చల్, ఏప్రిల్ 12 (ప్రజాస్వరం):

 

ఇంటర్మీడియట్ ఫలితాల్లో మేడ్చల్ పట్టణంలోని స్ఫూర్తి జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించి సత్తా చాటారు. మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూపులో ఎం. డి. సమ్రీన్ 470 మార్కుల గాను 466 మార్కులు, మొదటి సంవత్సరం బైపిసి గ్రూపులో నైలా ఫాతిమా 440 మార్కులకు గాను 435 మార్కులు, సిఇసి మొదటి సంవత్సరం గ్రూపులో సాక్షి కుమారి 500 మార్కుల గాను 491 మార్కులు సాధించి మేడ్చల్ పట్టణంలో మొదటి స్థానాల్లో నిలిచారు. ద్వితీయ సంవత్సరం బైపిసి గ్రూపులో తనిషా పర్వీన్ 1000 మార్కులకు గాను 992 మార్కులు, ద్వితీయ సంవత్సరం ఎంపీసీ గ్రూపులో తాటికొండ శ్రీలక్ష్మి 1000 మార్కులకు గాను 981 మార్కులు, ద్వితీయ సంవత్సరం ఎంపీసీ గ్రూపులో మనీష్ కుమార్ 1000 మార్కులకు గాను 981 మార్కులు, ద్వితీయ సంవత్సరం సీఈసీ గ్రూపులో కాజల్ 1000 మార్కులకు గాను 972 మార్కులు సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులను కళాశాల యాజమాన్య సభ్యులు శాలువాలతో సత్కరించి అభినందించారు. మేడ్చల్ పట్టణంలో ప్రతి సంవత్సరం ఉత్తమ ఫలితాలను సాధిస్తూ స్ఫూర్తి జూనియర్ కళాశాల ప్రతి సంవత్సరం ముందంజలో ఉంటుందని కళాశాల యాజమాన్య సభ్యులు తెలిపారు. కళాశాల అధ్యాపకులకు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్య సభ్యులు మంజుల ప్రకాష్, కమలాకర్ రెడ్డి, దేవరాజ్, గణేష్, రామ్ శంకర్, సత్యనారాయణ, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Latest News

గ్రామీణ ప్రాంత విద్యార్థిని అక్షర కు రాష్ట్ర స్థాయి ర్యాంక్ .... గ్రామీణ ప్రాంత విద్యార్థిని అక్షర కు రాష్ట్ర స్థాయి ర్యాంక్ ....
తూప్రాన్ ,ఏప్రిల్ 12 (ప్రజాస్వరం ) : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి    మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నాగుల పల్లి గ్రామానికి చెందిన అక్కంగారి అక్షర కు...
సంబంధిత ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలి....
ఇంటర్మీడియట్ ఫలితాల్లో సత్తా చాటిన 'స్ఫూర్తి' విద్యార్థులు...
తూప్రాన్ ఓ విందులో గొంతులో మాంసం ముక్క... 
గీతా జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారు... 
నవవధువు వివాహానికి పుస్తె మట్టెలు అందజేతా ....
న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు....