షార్ట్ సర్క్యూట్ తో ఓ ఇంటిలో అగ్ని ప్రమాదం....
By Prajaswaram
On
మేడ్చల్ , ఏప్రిల్ 10 (ప్రజాస్వరం) :
జిహెచ్ఎంసి పరిధిలోని మేడ్చల్ సర్కిల్‌లోని కిష్టాపూర్ డివిజన్ అర్చన కాలనీలో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంటిలో మంటలు చెలరేగాయి. బాధితుడు మద్దూరి అనిల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం అల్మారా పూర్తిగా కాలిపోయిందని అందులో ఉన్న బట్టలు, నగదు దగ్ధమై సుమారు లక్షన్నర రూపాయల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు తెలిపారు. అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరారు.సంఘటనను గుర్తించిన స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికి ప్రాణహాని జరగలేదు.
Latest News
10 Apr 2026 21:08:12
నార్సింగి, ఏప్రిల్ 10 ( ప్రజాస్వరం ): గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు పండించిన దాన్యాన్ని నిలువ ఉంచేందుకు గిడ్డంగులను నిర్మించడం జరిగిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త...


