బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలోనే రైతులకు మేలు జరిగింది... ..

ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి....

బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలోనే రైతులకు మేలు జరిగింది... ..

నార్సింగి, ఏప్రిల్ 10 ( ప్రజాస్వరం ):

 

గత  బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు పండించిన దాన్యాన్ని నిలువ ఉంచేందుకు గిడ్డంగులను నిర్మించడం జరిగిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు, నార్సింగ్ మండలంలోని నార్సింగి, నర్సంపల్లి పెద్ద తండా, గ్రామాలలో ఐకెపి, సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు, అనంతరం మహిళాలు శాలువాలతో ఆయనను ఘనంగా సన్మానించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోనే రైతులకు మేలు జరిగిందని రంగనాయక సాగర్, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల ద్వారా నీరు పుష్కలంగా రావడంతో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగి రైతులు పుష్కలంగా పంట పండించుకున్నారని రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ ఉంచుకునే విధంగా గిడ్డంగులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోనే రైతులు సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయి రెండున్నర సంవత్సరాలు గడిచిన ఏ నియోజకవర్గంలో గాని ఏ మండల కేంద్రాల్లో గాని ఒక్క గిడ్డంగిని కూడా నిర్మించలేకపోయారని ఆయన తెలిపారు. నర్సంపల్లి తండాలో సర్పంచ్ దుషని ఛత్రియ నాయక్ తమకు సేవాలాల్ జయంతి సందర్భంగా జెండా ఏర్పాటుకు స్థలం కేటాయించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో నార్సింగి సర్పంచ్ సుజాత మల్లేష్ గౌడ్, పెద్ద తండ సర్పంచ్ దుశాని చత్రియ నాయక్, తహసిల్దార్ గ్రేసీ భాయి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఐకెపి ఎపిఎం సృజన్ కుమార్ రెడ్డి, ఐకెపి సిసిలు శ్రీనివాస్ గౌడ్, శోభ, వార్డు సభ్యులు విష్ణు వర్ధన్ రెడ్డి, కందరి నవీన్ కుమార్మాజీ జెడ్పిటిసి బాణాపురం కృష్ణారెడ్డి,,మాజీ వైస్ ఎంపీపీ మల్లేష్ గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బాబు, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు భాషా నాయక్, భూపతి రాజు,  ఓం ప్రకాష్ యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest News

బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలోనే రైతులకు మేలు జరిగింది... .. బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలోనే రైతులకు మేలు జరిగింది... ..
నార్సింగి, ఏప్రిల్ 10 ( ప్రజాస్వరం ):   గత  బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు పండించిన దాన్యాన్ని నిలువ ఉంచేందుకు గిడ్డంగులను నిర్మించడం జరిగిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త...
షార్ట్ సర్క్యూట్ తో ఓ ఇంటిలో అగ్ని ప్రమాదం....
డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఆటో డ్రైవర్ కు 10వేలు జరిమానా... 
అతి వేగంతో వచ్చి ఆటోను,స్కూల్ బస్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్...
బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే...
జాతీయ రహదారిపై ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు....
తూప్రాన్ మున్సిపల్ లో కేసీఆర్ వేశాధారణ తో పర్యటన...